కారాబినియరీ ప్రార్థనా మందిరంలో దివ్యబలిపూజను సమర్పించిన పోప్

జులై 15 మంగళవారం రోమ్ సమీపంలోని కొండపై ఉన్న పట్టణంలోని Carabinieri ప్రధాన కార్యాలయ ప్రార్థనా మందిరంలో పొప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు.

ప్రధాన కార్యాలయం Villa dei Gesuiti హోలీ సీ యాజమాన్యంలో ఉంది 

ఇటలీ రక్షణ మంత్రి Guido Crosetto మరియు General Commander of the Carabinieri, Salvatore,ఇటలీ అగ్రపీఠాధిపతి Gian Franco sabaతో కలిసి కాస్టెల్ గాండోల్ఫోలో జరిగిన దివ్యబలిపూజలో పాల్గొన్నారు.

"మనమందరం దేవుని చిత్తాన్ని చేసినప్పుడు, అంటే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించడం ద్వారా మనమందరం నిజంగా యేసుకు సోదరులు మరియు సోదరీమణులు" అవుతాము అని ఆయన అన్నారు.

"దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తన తల్లిని మన తల్లిగా అప్పగించారు. 
మరియతల్లి దేవుని వాక్యాన్ని మొదట తన హృదయంలోకి ప్రేమతో, విశ్వాసంతో స్వీకరించింది కాబట్టి ఆమెను మొదటి శిష్యురాలిగా పరిగణిస్తారు అని పొప్ ముగించారు 

పూజ అనంతరం పోప్ లియో అల్బానోలోని Immaculate Conception Convent of the Poor Claresను సందర్శించారు, అక్కడ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేయడానికి కొంత సమయం కేటాయించారు.