కాంగోలో శాంతి కొరకు ప్రార్ధించమని విజ్ఞప్తి చేసిన పోప్ ఫ్రాన్సిస్

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చోటుచేసుకున్న పరిస్థితిపై పోప్ ఫ్రాన్సిస్ బుధవారం 29 జనవరి తన వారపు సామాన్య ప్రజల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.

శత్రుత్వాలను విరమించుకోవాలని , గోమా మరియు పరిసర ప్రాంతాలలో ప్రజలను రక్షించాలని కోరారు.

సోమవారం నుండి వేలాది మంది గోమా నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టారు, ఇప్పటికే నగరంలో 1 మిలియన్ మంది వ్యక్తులు స్థానభ్రంశం చెందారు.

ఇంగ్లాండ్ మరియు వేల్స్‌లోని కాథలిక్ చర్చి సహాయ సంస్థ అయిన CAFOD కంట్రీ డైరెక్టర్ బెర్నార్డ్ బలిబునో ప్రకారం, లక్షలాది మందికి తక్షణ మానవతా సహాయం అవసరం.

“పోరాటాల కారణంగా నగరం మూసివేయవలసి వచ్చింది,"  "లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, చాలామంది వీధుల్లో భిక్షాటన చేయవలసి వచ్చింది." అని మిస్టర్ బలిబునో అన్నారు,

గోమాలోని నాలుగు ప్రధాన ఆసుపత్రులు చికిత్స కోసం వందలాది మంది గాయపడిన వారితో నిండిపోయాయి. 

“స్థలం లేకపోవడం వల్ల కొన్నిసార్లు నేలపై పడుకున్న రోగులకు చికిత్స చేయడానికి మూడు శస్త్రచికిత్స బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి” అని గోమాలోని ICRC ప్రతినిధి బృందం అధిపతి మిరియమ్ ఫావియర్ అన్నారు.