కళాకారులు ప్రేమ, ఆనందం మరియు దాతృత్వంతో పని చేయాలని - పొప్ ఫ్రాన్సిస్ గారు

కళాకారులు ప్రేమ, ఆనందం మరియు దాతృత్వంతో పని చేయాలని  పొప్ ఫ్రాన్సిస్ గారు ప్రోత్సహించారు

పోప్ ఫ్రాన్సిస్ 1వ శతాబ్దపు రోమన్  ప్రదర్శనశాల  వెరోనా అరేనా ఫౌండేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భముగా కలుసుకున్నారు.  పోప్ ఫ్రాన్సిస్ గారు వెరోనా అరేనా యొక్క కళాకారులను ( Verona Arena's) ప్రేమ, దాతృత్వం, ఆనందాన్ని ప్రజలకు అందించమని ప్రోత్సహించారు.  

1913లో గియుసేప్ వెర్డి యొక్క ఐడా ప్రదర్శనతో ప్రారంభమైన అరేనా డి వెరోనా ప్రదర్శనశాల "పునర్జన్మ" కోసం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నందున, పొప్ ఫ్రాన్సిస్ వారిని ఆహ్వానించారు.  

ఈ సందర్భముగా దేవుడు ఇచ్చిన దీవెనలతో  కళలలో నిమగ్నమైన వారిని ప్రేమ, ఆనందం మరియు దాతృత్వంతో పని చేయాలని పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రోత్సహించారు.

అరేనా యొక్క 100 సీజన్ల కళాత్మక కార్యకలాపాలను అత్యున్నత స్థాయిలో పోప్ ఫ్రాన్సిస్ గారు గుర్తించి , ఇవి గతం నుండి ఒక వారసత్వాన్ని సేకరించి, దానిని భవిష్యత్తు తరాలకు అందించడానికి సజీవంగా ఉంచాయి అని అన్నారు.

పోప్ అరేనా యొక్క బహుముఖ చరిత్ర గురించి చర్చించారు, అరేనా భవనం "ఇరవై శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది మరియు ఇది ఎల్లప్పుడూ నివసించే ప్రదేశంగా ఉన్నందున కాలక్రమేణా ఖచ్చితంగా భద్రపరచబడింది" అని పేర్కొన్నారు.

అరేనా భవన నిర్మాణములో  ఎంతో  పని, ఎంతో  అంకితభావం మరియు ఎంతో  కృషి తో నిర్మించారు అని పోప్ ఆశ్చర్యపోతూ, నిర్మాణాలను నిర్మించిన వారందరికీ నివాళులు అర్పిస్తూ మరియు పునర్నిర్మించిన వారికి, రచయితలు మరియు కళాకారులకు, ఈవెంట్‌ల నిర్వాహకులకు ,'తెర వెనుక' పనిచేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.

వారి తో మాట్లాడుతూ  వినయం మరియు దాతృత్వం, " కథ ను  చెప్పే నిజమైన కళాకారుడి యొక్క రెండు సద్గుణాలు" అని పొప్ ఫ్రాన్సిస్ గారు  చెప్పారు.

 

Article and Design By
Kranthi
RVA Telugu Online Producer