కథోలిక దేవాలయం పై జరిగిన దాడిని ఖండించిన ఫ్రాన్సీస్ జగద్గురువులు

ఇస్తాంబుల్‌లోని కథోలిక  దేవాలయం పై జరిగిన దాడిని  ఖండించిన  ఫ్రాన్సీస్ జగద్గురువులు

ఇస్తాంబుల్‌లోని కథోలిక  దేవాలయం పై జరిగిన దాడిని ఫ్రాన్సీస్ జగద్గురువులు ఖండించారు. పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు గారు  తన ఆదివారం ఏంజెలస్ వద్ద  విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడారు. దేవాలయం పై జరిగిన  దాడి పట్ల సానుభూతిని తెలియజేసారు.
ఇస్తాంబుల్ అపోస్టోలిక్ వికార్ మరియు కాన్స్టాంటినోపుల్ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్  మహా పూజ్య  మాసిమిలియానో ​​పాలినురో గారు  దాడి వెనుక కారణాలను వెతకాలని, నిజాలను బయటకు తీయాలని  అధికారులకు విజ్ఞప్తి చేశారు.

 సెయింట్ మేరీ డ్రేపెరిస్ దేవాలయం లో ఈ దాడి జరిగింది. మహా పూజ్య పాలినూరో గారు మాట్లాడుతూ  ప్రార్థనల  సమయంలో, ఇద్దరు సాయుధ వ్యక్తులు గాలిలోకి  తుపాకీ కాల్పులు జరుపుతూ ప్రవేశించారని తెలిపారు.  సత్యాన్ని వెదకాలని మేము అధికారులను కోరుతున్నాము అని మహా పూజ్య పాలినూరో గారు అన్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందినట్లు మరియు అనేకమంది గాయపడ్డారు అని టర్కీ అంతర్గత మంత్రి అలీ ఎర్లికాయ తెలిపారు. సర్యార్ జిల్లాలోని శాంటా మారియా దేవాలయం  సమీపంలో దాడి జరిగిందని, ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer