ఇరాక్ అగ్నిప్రమాద బాధితులకు కొరకు ప్రార్దించిన పోప్

ఇరాక్‌లోని షాపింగ్ సెంటర్ అగ్నిప్రమాద బాధితులకు పోప్ లియో XIV తన "ఆధ్యాత్మిక సంఘీభావం" ముఖ్యంగా ప్రమాదంలో గాయపడిన వారికి,వారి కుటుంబాలకు తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు.
కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్‌లో పోప్ మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు
తూర్పు ఇరాక్‌లోని Wasit Province లోని Iraqi city of Kutలోని ఒక కొత్త షాపింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది 69 మంది మరణించారు. మరో పదకొండు మంది కనిపించకుండా పోయినట్లు నివేదించబడింది.
ఐదు రోజుల క్రితం తెరిచిన ఈ మాల్‌లో ఒక హైపర్ మార్కెట్ మరియు రెస్టారెంట్ ఉన్నాయి, అక్కడ ప్రజలు షాపింగ్ చేస్తూ భోజనం చేస్తున్నప్పుడు మంటలు చెలరేగాయి.
భవనం లోపల నుండి 45 మందిని పౌర రక్షణ బృందాలు రక్షించాయి.
Wasit గవర్నర్ మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
అగ్నిప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించబడిందని,భవనం యజమానిపై ఇప్పటికే కేసులు నమోదు చేయబడ్డాయి అని ప్రకటన పేర్కొంది