ఇటాలియన్ ఛారిటీ మ్యాచ్‌కు వీడియో సందేశాన్ని పంపిన పోప్

Holy See’s Children’s Hospital Bambino Gesù మరియు Italian Caritas నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో పాల్గొన్నవారిని ఉద్దేశించి జులై 15 న ఒక వీడియో సందేశాన్ని పంపారు
విభజనలతో నిండిన ప్రపంచంలో సంభాషణ మరియు శాంతిని ప్రోత్సహించడం ఎంతో అవసరమని పొప్ అన్నారు.
మానవత్వం ప్రమాదంలో ఉంది క్రీడలు, రాజకీయాలు, సంగీతం మరియు మరిన్నింటి ద్వారా ఐక్యతను ప్రోత్సహించడం అత్యవసరం అని అన్నారు
ఈ ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా Bambino Gesù ఆసుపత్రిలో చికిత్స పొందున ఇటలీ మరియు విదేశాల నుండి వచ్చిన పేద కుటుంబాలకు వసతి మరియు భౌతిక సహాయాన్ని అందిస్తుంది.
ఈ 34వ మ్యాచ్ సంగీతకారుల బృందం మరియు రాజకీయ నాయకుల బృందం మధ్య జరుగుతుంది.
ఇందులో వివిధ ఇటాలియన్ కళాకారులు మరియు ప్రదర్శకులతో ఒక కచేరీ కూడా జరిగింది