అర్జెంటీనా వరద బాధితులకు సానుభూతిని వ్యక్తం చేసిన పొప్ ఫ్రాన్సిస్

మార్చి 7 -8 తేదీలలో అర్జెంటీనా ఓడరేవు నగరం బహియా బ్లాంకాను (Bahía Blanca ) తాకిన వినాశకరమైన వరదలకు పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు.

రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రి కోలుకుంటున పొప్ ఫ్రాన్సిస్ బహియా బ్లాంకాతో పాటు సెర్రీ నగరాన్ని కూడా నాశనం చేసిన విషాదాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన స్పానిష్ భాషలో బహియా బ్లాంకా అగ్రపీఠాధిపతి మహా పూజ్య  Carlos Alfonso Azpiroz Costa ఒక టెలిగ్రామ్ పంపారు.

కనీసం 16 మంది మరణించారు మరియు ముగ్గురు తప్పిపోయారు. 1 మరియు 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు.

రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు, కానీ రెండు నగరాలు దాదాపు పూర్తిగా వరదలకు లోనవడంతో వారి ప్రయత్నాలు కష్టతరంగా మారాయి.

"ఈ విపత్తు" వల్ల ప్రభావితమైన వారందరికీ తన కుమారుడైన యేసుక్రీస్తు ముందు మధ్యవర్తిత్వం వహించమని మరియతల్లిని  వేడుకుంటూ, వారిని ఆశీర్వదిస్తూ పొప్ ఫ్రాన్సిస్ ఈ టెలిగ్రామ్ ను ముగించారు.