సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

రొమేనియాలోని ఇయాసి మేత్రాసన  యువకులను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. లేఖలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ "ప్రపంచంలో మంచితనం మరియు ప్రేమను నాటడానికి మీ వద్ద ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగించాలని, ముఖ్యంగా మనుషుల మధ్య సోదర భావాన్ని పెంపొందించడానికి ముఖ్యంగా శాంతిని నిర్మించేవారిగా ఉండండి అని కోరారు.

మరియు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారకుండా ఉండాలని, ముఖ్యంగా  ఇంటర్నెట్ ప్రపంచంలో (virtual life) జీవించడం ప్రారంభించారని దీనివల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుందని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు. వాస్తవిక జీవితాన్ని కోల్పోకుండా వర్చువల్ జీవితంలో చిక్కుకోకుండా వారిని హెచ్చరించాడు.

"దేవుడు ఇచ్చిన నిజమైన ప్రపంచంలోకి వెళ్లండి అని , ప్రజలను కలవండి, వారి కథలను వినండి, కుటుంబం మరియు స్నేహితులతో కలసి ఉంటూ, వారి కష్టాలలో వారికీ  సహాయ పడుతూ  విశ్వాసంలో కలిసి ఎదగాలని, నిజమైన సంపద రోజువారీ మానవ సంబంధాలలో ఉంది అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

చివరిగా సెప్టెంబరులో బ్రసోవ్ జిల్లాలో జరిగే జాతీయ యువజన సమావేశంలో కతోలిక యువత పాల్గొనాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆహ్వానించారు. విశ్వాసంలో కలిసి ఎదగడానికి, అనుభవాలను పంచుకోవడానికి మరియు మీ క్రైస్తవ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక విలువైన అవకాశం అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer