సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రసారం చేయబడిన పొప్ ఫ్రాన్సిస్ కృతజ్ఞతా సందేశం

మార్చి 6 గురువారం సాయంత్రం ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ కన్సెక్రేటెడ్ లైఫ్ మరియు సొసైటీస్ ఆఫ్ అపోస్టోలిక్ లైఫ్ డికాస్టరీ ప్రో-ప్రిఫెక్ట్ కార్డినల్ ఏంజెల్ ఫెర్నాండెజ్ ఆర్టిమే (Cardinal Ángel Fernández Artime)నేతృత్వంలో సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జపమాల ప్రార్థన ప్రారంభంలో 

ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరినప్పటి నుండి తాను అందుకున్న ప్రేమ మరియు సాన్నిహిత్యాన్ని పొప్ ఫ్రాన్సిస్ స్పానిష్‌లో రికార్డ్ చేయబడిన కృతజ్ఞతా సందేశం ప్రసారం చేయబడింది.

సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుండి నా ఆరోగ్యం కోసం మీరు చేసే ప్రార్థనలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఇక్కడి నుండి మీతో పాటు వస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, మరియు ఆ మరియతల్లి  మిములని రక్షించును గాక, ధన్యవాదాలు." అని ఆ సందేశంలో ఉంది 

జెమెల్లి ఆసుపత్రిలో న్యుమోనియాకి చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం కోసం ఫిబ్రవరి 24, సోమవారం నుండి,సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో రోమ్‌లో నివసిస్తున్న కార్డినల్స్‌తో కలిసి వేలాది మంది విశ్వాసులు , రోమన్ క్యూరియా కలిసి పరిశుద్ధ జపమాలను జపించారు.