ప్రపంచ శాంతి మరియు మతపరమైన హింసకు గురైన వారి కొరకు ప్రార్ధించిన పోప్ ఫ్రాన్సిస్
సంఘర్షణ ప్రాంతాలలో శాంతి, అట్టడుగున ఉన్నవారికి సంఘీభావం, అన్యాయం మరియు దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయమని 17, నవంబర్ ఆదివారం త్రికాల ప్రార్ధన సమయంలో పిలుపునిచ్చిన పోపు ఫ్రాన్సిస్.
"యుద్ధం అమానవీయం" మరియు "ఆమోదించలేని నేరాలను సహించమని" సాధారణ విశ్వాసులకు గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కొనసాగుతున్నందున, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్ మరియు మయన్మార్ కొరకు ప్రార్థించారు.
ఈ సంవత్సరం ప్రపంచ పేదల దినోత్సవం కొరకు సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధం 21:5
నుండి తీసుకున్న " పేదవాడి మొరను దేవుని చెవిన పడును" అనే నేపథ్యం ఎంచుకున్నారు
పేదరికంలో మగ్గుతున్న వారి అవసరాలను తీర్చాల్సిన ఆవశ్యకతను, మేత్రాసన మరియు విచారణ పరిధిలో పేదలకు సంఘీభావం తెలిపే కార్యక్రమాలను నిర్వహించే వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పేదల పట్ల ఎల్లప్పుడూ ఉదారతతో మరియు కరుణతో వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను పొప్ గారు తెలియచేసారు.
పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగం మరియు హింస నుండి నివారణ మరియు వైద్యం కోసం ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 18 న జరుపుకుంటున్న సందర్బంగా .
దుర్వినియోగమైయే ప్రతి సందర్భాన్ని "నమ్మక ద్రోహం" మరియు "జీవిత ద్రోహం" అని పిలిచారు మరియు విచ్ఛిన్నమైన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రార్థన అత్యవసరం అని తెలియపరిచారు
గురువారం నవంబర్ 21 న జరుపుకునే ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా, మత్స్యకారులు మరియు వారి కుటుంబాల కొరకు పోపు గారు ప్రార్థనలు చేశారు, వారు పని చేస్తున్నప్పుడు వారిని రక్షించమని సాగరమతాను ప్రార్థించారు.
చివరగా, ఫ్రాన్సిస్ పాపు గారు రోడ్డు ప్రమాదాల బాధితులను గుర్తు చేసుకున్నారు.
అటువంటి విషాదాలను నివారించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నాలను ప్రోత్సహించే ముందు, ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు, అలాగే వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థించారు.