ఇటలీ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

మంగళవారం, అక్టోబర్ 14న రోమ్ మీదుగా క్విరినల్ ప్యాలెస్‌కు ప్రయాణించి, ఇటలి అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను పోప్ లియో కలిసారు.
"రోమ్ బిషప్ మరియు ఇటలీ ప్రిమేట్‌గా, ఈ సందర్శన ద్వారా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటాలియన్ ప్రజలతో హోలీ సికి ఉన్న బంధాన్ని పునరుద్ధరించడం నాకు ఆనందంగా ఉంది " అని పోప్ సందర్శన ముగింపులో అన్నారు.
దేశాధినేతగా పోప్ లియో తొలి పర్యటన తన పొరుగు దేశమైన ఇటలీకి జరిగింది.
ఇది కేవలం పర్యటన మాత్రమే కాదు హోలీ సీ మరియు ఇటలీ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం
ఉదాహరణకు, మధ్యధరా దేశమైన ఇటలీ చిన్న రాష్ట్రాలకు నాణెములను ముద్రించడం మరియు పోప్ పర్యటనలకు విమానాలను కూడా అందిస్తుంది.
పోప్‌ను స్వాగతించడానికి అధ్యక్ష భవనం అలంకరించబడింది.
ఇరువురు అరగంట సేపు సమావేశమయ్యారు. కుటుంబ రక్షణ, గర్భధారణ నుండి వృద్ధాప్యం మరియు మరణించే వరకు అన్ని దశలలో ప్రాణాలను రక్షించడాన్ని ప్రోత్సహించాలని పోప్ పిలుపునిచ్చారు. వలస సంక్షోభం అనే అంశంపై పోప్ తన వైఖరిని వెల్లడించాడు.
ఇటాలియన్ సమాజ విలువలు మరియు సంప్రదాయాలలోకి వచ్చే వారిని స్వాగతించడాని నేను అభినందిస్తున్నాను
ఇటాలి అధ్యక్షుడు మరియు పోప్ ప్రస్తుత అంతర్జాతీయ వ్యవహారాలను కూడా చర్చించారు. ముఖ్యంగా, గాజా మరియు బందీలకు సంబంధించి మధ్యప్రాచ్యంలో కుదిరిన ఒప్పందాలను వారు చర్చించారు