మతపరమైన విలువల పట్ల గౌరవం లేకపోవడం అసహనానికి కారణం అన్న పోప్ ఫ్రాన్సిస్

నవంబర్ 29 ,30 తేదీలలో వాటికన్‌లో జరుగుతున్న "సర్వమత సదస్సు"లో పాల్గొన్న వారిని ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ తన ప్రసంగంలో, "అసహనం మరియు ద్వేషంతో" నిండిన ప్రస్తుత సమయంలో సంభాషణ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.

"మతాల యొక్క గొప్ప బోధనల పట్ల గౌరవం లేకపోవడమే ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యాత్మక పరిస్థితులకు ఒక కారణం."

"శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ వారు  నిర్వహించిన సర్వమత సదస్సు శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వాటికన్‌లో సమావేశమైన విశ్వాస నాయకులు మరియు ప్రతినిధులతో మాట్లాడుతూ "మతాల యొక్క గొప్ప బోధనల పట్ల గౌరవం లేకపోవడమే ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అసహనానికి ఒక కారణం."  అని పొప్ ఫ్రాన్సిస్ అన్నారు 


హిందూ "ఆధ్యాత్మిక మార్గదర్శి" మరియు "సంఘ సంస్కర్త" శ్రీ నారాయణ గురు తన జీవితాన్ని "సామాజిక మరియు మతపరమైన అభ్యున్నతి" కొరకు అంకితం చేశారని పోప్ అన్నారు.

కుల వ్యవస్థను వ్యతిరేకించడం ద్వారా, "మానవులందరూ, వారి జాతి , మత మరియు సంస్కృతీ సంప్రదాయాలతో సంబంధం లేకుండా, ఒకే మానవ కుటుంబ సభ్యులే" అనే సందేశాన్ని వ్యాప్తి చేసారు.

వంద సంవత్సరాల తరువాత, మతాంతర సంభాషణ కోసం డికాస్టరీ మద్దతుతో నిర్వహించిన "సర్వమత సదస్సు"లో  "మెరుగైన మానవత్వం కోసం మతాలు కలయిక " అనే ఇతివృత్తాన్ని పోప్ "మన కాలానికి నిజంగా సంబంధితమైనది మరియు ముఖ్యమైనది"గా అభివర్ణించారు. 


"గౌరవం, కరుణ, సయోధ్య, మరియు పరస్పర సంఘీభావం" సంస్కృతిని పెంపొందించడానికి "సద్భావన కలిగిన వ్యక్తుల" మధ్య సహకారం కొరకు పోప్ ఫ్రాన్సిస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందేశం గత సెప్టెంబర్‌లో ఇస్తిక్‌లాల్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొని ఉందని , ఇది "వ్యక్తిగతవాదం, మినహాయింపు, ఉదాసీనత మరియు హింస" విలువలకు విరుగుడుగా పనిచేస్తుంది అని పొప్ ఫ్రాన్సిస్ ముగ్గించారు