ప్రపంచ శాంతి కోసం ఐక్యత, నిస్వార్థమైన సేవకు కార్డినల్ జార్జ్ కూవకాడ్ పిలుపు

ప్రపంచ శాంతి కోసం ఐక్యత, నిస్వార్థమైన సేవకు కార్డినల్ జార్జ్ కూవకాడ్ పిలుపు

ప్రపంచ శాంతి కోసం ఐక్యత, నిస్వార్థమైన  సేవకు కార్డినల్ జార్జ్ కూవకాడ్ పిలుపు

అంతర్మత సంభాషణల విభాగం (డికాస్టరీ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్) అధిపతి, గౌరవనీయులు మహా పూజ్య జార్జ్ కార్డినల్ కూవకాడ్ గారు, ప్రపంచ శాంతి కోసం ఐక్యతను బలోపేతం చేయాలని, నిస్వార్థ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సిక్కులు, క్రైస్తవులకు పిలుపునిచ్చారు. 

బర్మింగ్‌హామ్‌లోని నిష్కామ్ సెంటర్‌లో “ప్రపంచ శాంతి కోసం ఐక్యత, సేవలను ప్రోత్సహించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదాం” అనే ఇతివృత్తంతో నిర్వహించిన సిక్కు–క్రైస్తవ మతాంతర సంభాషణ సమావేశంలో ఆయన ఈ సందేశాన్ని అందించారు.

పరిశుద్ధ  పోప్ ఫ్రాన్సిస్ గారి మాటలను  ఉటంకిస్తూ, “ఐక్యత అంటే సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించడం, కార్యాచరణ చేపట్టడం” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, పరిశుద్ధ లియో పాపు గారు  చెప్పిన “శాంతి నెలకొనాలంటే ప్రతి వ్యక్తి గౌరవం, ప్రాథమిక హక్కులను గౌరవించడంతో పాటు, ప్రజల మధ్య ఐక్యత కూడా అవసరం.”ఈ మాటలను కూడా అయన గుర్తుచేశారు. 

ఉదాసీనత, స్వార్థం, అన్యాయాలను అధిగమించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కార్డినల్ కూవకాడ్, పేదలు, బలహీన వర్గాలకు సేవ చేయాలని, పరస్పర సయోధ్యను పెంపొందించాలని, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని ఇరు మతాల ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో మానవీయ విలువలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు.

సెయింట్ మదర్ థెరిసా గారి మాటలను గుర్తుచేస్తూ, “ప్రేమ ఫలం సేవ, సేవ ఫలం శాంతి” అని ఆయన పేర్కొన్నారు.

చివరగా, మతాంతర సంభాషణలకు, శాశ్వత ప్రపంచ శాంతికి ఐక్యత, నిస్వార్థ సేవలను పునాదులుగా చేసుకోవాలని కార్డినల్ జార్జ్ కూవకాడ్ అందరికీ పిలుపునిచ్చారు.

Article and Design by M Kranthi Swaroop

Telugu Survey Popup Image