ప్రపంచ శరణార్థుల దినోత్సవం

  ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏట జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కలిపించడంకోసం ఈ దినోత్సవంను జరుపుతున్నారు.

శరణార్థి అంటే “హింసకు  స్థిరపడిన భయం” కారణంగా తన ఇల్లు మరియు దేశం వదిలి  పారిపోయిన వ్యక్తి. ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల ప్రభావాల నుండి తప్పించుకోవడానికి చాలా మంది శరణార్థులు ప్రవాసంలో ఉన్నారు.శరణార్థులందరినీ గౌరవించటానికి, అవగాహన పెంచడానికి మరియు మద్దతును కోరడానికి ఈ రోజును జ్ఞాపకం చేస్తారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థుల అంశం ప్రధాన సమస్యగా మారడంతో శరణార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 14, 1950న ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాల ఫలితంగా అనేకమంది ప్రజలు నిర్వాసితులై శరణార్థులుగా మారుతూనే ఉన్నారు.

నేటి ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 కరోనా వైరస్ వల్ల చాలా మంది నిరాశ్రయులయ్యారు. శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అమానవీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్నింటిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు  ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్నా  ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ ('యునైడెట్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ - యుఎన్‌హెచ్‌సిఆర్) పిలుపుమేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పౌర సంఘాలు ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

 

Add new comment

5 + 0 =