సామూహిక ప్రార్థనను నిర్వహించిన ICYM తెలుగు ప్రాంతం

ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ (ICYM) తెలుగు ప్రాంతం వారు ఫిబ్రవరి 21, 2025న సాయంత్రం 7:00 నుండి 7:30 వరకు పొప్ ఫ్రాన్సిస్ కు దైవిక స్వస్థత చేకూరాలని ఉపవాస దినోత్సవం మరియు ఆన్‌లైన్ లో జపమాలను జాప్పించారు.
తెలుగు రాష్ట్రాల్లోని, వివిధ ప్రాంతాల యువత త్యాగానికి చిహ్నంగా ఉపవాసం పాటిస్తూ మరియు పొప్ ఆరోగ్యం కోసం ఆన్‌లైన్ లో జపమాల జపించడం ద్వారా ఆ మరియతల్లి మధ్యవర్తిత్వాన్ని కోరారు.
యువకుల కుటుంబాలు కూడా ప్రార్థనలో పాల్గొనడం గొప్ప విశేషం
ICYM తెలుగు ప్రాంత నాయకులు ఈ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు మరియు పోప్ ఫ్రాన్సిస్ కోసం తమ ప్రార్థనలను కొనసాగించాలని ప్రోత్సహించారు.