ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న వేళాంగణిమాత విచారణ

ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న వేళాంగణిమాత విచారణ
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణిమాత దేవాలయంలో తపస్సుకాలం దానధర్మ సేవాకార్యం లో భాగంగా కైలాసపురంలోని వేళాంగణిమాత విచారణ మరియ దళ సభ్యులు "ధర్తీ ఫౌండేషన్ ఆకర్ చైల్డ్ కేర్" ను సందర్శించారు. కేర్ లో ఉన్న చిన్నారి బిడ్డలతో మరియ దళ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ సంతోష్ CMF గారు పాల్గొని చిన్నారులకొరకు ప్రార్ధించారు.
పాల్గొన్న సభ్యులు "ధర్తీ ఫౌండేషన్ ఆకర్ చైల్డ్ కేర్" లో ఉన్న చిన్నారులకు మంచి భోజనమును పెట్టి, వారితో కొంత సేపు గడిపారు. విచారణ సభ్యులు చేసిన ఈ మంచి సేవా కార్యమును అభినందిస్తూ, ఫాదర్ సంతోష్ CMF గారు వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer