58 వ ప్రపంచ సమాచార దినోత్సవం.
హైదరాబాద్ అగ్రపీఠం, సూరారం, ఫాతిమామాత దేవాలయము కరుణగిరి పుణ్యక్షేత్రం నందు మే 12 న ఉదయం 7 గంటలకు క్రీస్తు మోక్షారోహణ పండుగ మరియు 58 వ ప్రపంచ సమాచార దినోత్సవము జరిగింది.
అమృతవాణి రేడియో వేరితాస్ ఆసియా, సెయింట్ పాల్స్ కమ్యూనికేషన్ మీడియా సెంటర్ వారు సంయుక్తంగా ఈ దివ్యబలి పూజను సమర్పించారు.
అమృతవాణి డైరెక్టర్,rva కోఆర్డినేటర్ గురుశ్రీ పీ సుధాకర్ గారు కృత్రిమ మేధస్సు మరియు విస్డం అఫ్ ఆర్ట్ అనే అంశంపై మరియు క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండుగ గురించి విశ్వాసులకు చక్కగా భోదించారు.
పరిశుద్ధ పాపు గారు సందేశాన్ని చాల క్లుప్తంగా పండుగ గురించి ప్రజలకు భోదించారు
సెయింట్ పాల్స్ సిస్టర్స్ దివ్యబలి పూజలో విశ్వాసుల ప్రార్థనతో భక్తియుతంగా ముందుకు నడిపారు. విచారణ కర్తలు గురుశ్రీ ఏరువ జోజి రెడ్డి గారు దివ్యబలి పూజను సమర్పించారు ప్రతి ఒక్కరిని మంచి సువార్తీకులుగా క్రీస్తు ప్రేమ సందేశాన్ని పంచాలని తెలిపారు
ఉదయం ౯ గంటకు తెలుగులో దివ్యబలి పూజను గురుశ్రీ పాల్ ప్రభాకర్ గారు దివ్యబలిపూజను సమర్పించగా అమృతవాణి డైరెక్టర్,rva కోఆర్డినేటర్ గురుశ్రీ పీ సుధాకర్ గారు క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండుగ గురించి విశ్వాసులకు చక్కగా భోదించారు. RVA ఆన్లైన్ ప్రొడ్యూసర్ శ్రీ అరవింద్ దివ్యపూజ పరిచయవాక్యాలు మరియు విశ్వాసుల ప్రార్ధనను భక్తియుతంగా ముందుకు తీసుకువెళ్లారు.
అమృతవాణి డైరెక్టర్,rva కోఆర్డినేటర్ గురుశ్రీ పీ సుధాకర్ గారు అమృతవాణి అధ్యక్షులు ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య పొలిమెర జయరావు గారు మరియు ఉపాధ్యక్షులు శ్రీకాకుళం పీఠాధిపతులు మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్ గారి తరుపున విచారణ విశ్వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.