సి.సి.బి.ఐ యువతా కమిషన్ లో నూతన నియామకం

సి.సి.బి.ఐ యువతా కమిషన్ లో నూతన నియామకం

వరంగల్ మేత్రాసనం, ఫాతిమా మాత కథెడ్రల్ కు చెందిన శ్రీ సాగర్ గబ్బెట గారు, CCBI నేషనల్ యువత విభాగంలో సభ్యుడిగా  నియమితులయ్యారు.

CCBI ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో సెప్టెంబరు 10-11,2024న జరిగిన 95వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అక్టోబరు 1, 2024 నుండి  4 సంవత్సరాల పాటు యువత విభాగంలో సభ్యుడిగా సాగర్ గబ్బెట కొనసాగనున్నారు.

యువతని అభ్యుదయపథంలో ముందుకు నడిపించాలని, అమృతవాణి అధ్యక్షులు, ఏలూరు పీఠకాపరి మహా పూజ్య జయరావు పొలిమేర గారు, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వీరిని అభినందిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer