సాంటా మార్టా వృద్ధుల గృహాన్ని సందర్శించిన పోప్

సోమవారం జులై 21 ఉద యం కాస్టెల్ గాండోల్ఫోలోని సాంటా మార్టా వృద్ధుల గృహాన్ని పోప్ లియో సందర్శించారు
అక్కడ నివసిస్తున్న మహిళలకు మరియు వారి సంరక్షకులకు ఓదార్పు, ప్రోత్సాహం మరియు ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని అందించారు.
టెలిగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో, హోలీ సీ ప్రెస్ ఆఫీస్, పోప్ వేసవిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్న
విల్లా బార్బెరిని ప్రాంతంలో ఉన్న వృద్ధుల గృహాన్ని నడిపిస్తున్న మఠకన్యలు పోప్ ను స్వాగతించారు.
ఆ ఇంట్లో నివసిస్తున్న ఇరవై మంది వృద్ధ మహిళలలో ప్రతి ఒక్కరినీ స్వయంగా పలకరించడానికి పొప్ సమయం తీసుకున్నారు, వారందరూ 80 మరియు 101 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.
విశ్వాసం,నమ్మకం, పట్టుదలతో ఉండమని వారిని ప్రోత్సహిస్తూ, పోప్ లియో XIV వృద్ధులను శ్రీసభకు మరియు ప్రపంచానికి విశ్వాసానికి చిహ్నాలు"గా అభివర్ణించారు.