సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగ కార్యదర్శిగా సిస్టర్ టిజియానా

ఫ్రాన్సిస్కాన్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ మాజీ సుపీరియర్ జనరల్ సిస్టర్  Tiziana Merlettiని, 
సమర్పణ జీవితం, అపోస్తలిక జీవన సంస్థల విభాగ కార్యదర్శిగా XIV  
లియో పొప్ నియమించారు.

జనవరి 7 న పోప్ ఫ్రాన్సిస్ చే వాటికన్ విభాగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా నియమితులైన సిస్టర్ Simona Brambilla కు సెక్రటరీ తాను సేవ చేయనున్నారు   

2023 నుండి 2025 వరకు, సిస్టర్ బ్రాంబిల్లా డికాస్టరీ కార్యదర్శిగా పనిచేశారు, ఇప్పుడు అదే పనిని సిస్టర్ Merletti నిర్వహించనున్నారు.

సిస్టర్ టిజియానా మెర్లెట్టి సెప్టెంబర్ 30, 1959న ఇటలీలోని పినెటోలో జన్మించారు.

1986లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫ్రాన్సిస్కాన్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్‌ తన మొదటి మాటపట్టును స్వీకరించారు 

1984లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు మరియు 1992లో రోమ్‌లోని పోంటిఫికల్ లాటరన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లాలో డాక్టరేట్ పొందారు.

2004 నుండి 2013 వరకు తమ సంస్థకు సుపీరియర్ జనరల్‌గా పనిచేశారు.

ప్రస్తుతం రోమ్‌లోని పోంటిఫికల్ ఆంటోనియనమ్ విశ్వవిద్యాలయంలోని కానన్ లా ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గాను మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సుపీరియర్స్ జనరల్‌లో కానన్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.