వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ తో సంబాషించిన పోప్ లియో

చంద్రునిపై అపోలో 11 లాండై 56 సంవత్సరాలు కానున్న సందర్బంగా పోప్ లియో వ్యోమగామి Buzz Aldrinతో మాట్లాడారు అని టెలిగ్రామ్‌లో హోలీ సీ ప్రెస్ ఆఫీస్ నివేదించింది.
1969 జూలై 16న NASA చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవ సహిత మిషన్ అపోలో 11ను ప్రారంభించింది.
జూలై 20న, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడు అయ్యాడు మరియు అంతరిక్ష నౌకలో ఉన్న బజ్ ఆల్డ్రిన్ రెండవవాడు అయ్యాడు.
ఆ ప్రకటనలో, ప్రెస్ ఆఫీస్ ఇలా కొనసాగించింది,
"అతను ఒక చారిత్రాత్మక విజయ జ్ఞాపకాన్ని పొప్ తో పంచుకున్నాడు - మానవ చాతుర్యానికి నిదర్శనం - మరియు, కీర్తన 8లోని పదాలను ఉపయోగించి, వారు కలిసి సృష్టి రహస్యం, దాని గొప్పతనం మరియు దాని దుర్బలత్వాన్ని గురించి మాట్లాడుకున్నారని ప్రెస్ ఆఫీస్ పేర్కొంది
కాల్ ముగించే ముందు, పోప్ లియో వ్యోమగామిని, అతని కుటుంబాన్ని మరియు అతని సహకారులను ఆశీర్వదించారు.
సంభాషణ తర్వాత, Buzz Aldrin సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు, "అపోలో 11 చంద్రునిపై అడుగుపెట్టిన 56వ వార్షికోత్సవం సందర్భంగా పోప్ లియో అత్యున్నత ఆశీర్వాదం అందుకున్నందుకు ANCA మరియు నేను కృతజ్ఞులం అయ్యాము.