మొహమ్మద్ అబ్దేల్‌సలాంతో సమావేశమైన పోప్

Muslim Council of Elders and of the Zayed Award for Human Fraternity సెక్రటరీ జనరల్ న్యాయాధికారి Mohamed Abdelsalam ను సోమవారం ఆగస్టు 25 న వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్‌లో పోప్ కలిసారు .

అబ్దేల్‌సలాం మాట్లాడుతూ, శాంతి మరియు సోదరభావాన్ని ప్రోత్సహించడానికి ఒక మార్గంగా మతాంతర సంభాషణ ప్రాముఖ్యతను చర్చించామని తెలిపారు.

సంఘర్షణలను అంతం చేయాలని, శాంతిని పెంపొందించాలని పిలుపునిచ్చేందుకు, మత నాయకుల ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా ఆయన అభివర్ణించారు.

తాను సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్న ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్ శాంతి సాధనలో మత నాయకుల అభిలాషను బలోపేతం చేయడానికి  తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.