ఫ్రాన్స్‌ వత్తాసు బాలలను కలిసిన పోప్ లియో

జూబిలీ యాత్రలో భాగంగా రోమ్‌కు వచ్చిన ఫ్రాన్స్‌కు చెందిన సుమారు 360మంది వత్తాసు బాలురును ఆగస్టు 25 న పోప్ లియో కలిసారు. 

Clementine Hall  లో ఫ్రెంచ్ మఠవాసుల అత్యంత ప్రసిద్ధ గీతాలలో ఒకటైన టైజే  "Laudate Dominum" ఆలపించారు.

దివ్యసత్ప్రసాద ప్రాముఖ్యత మరియు అర్థం గురించి పోప్ వారితో మాట్లాడారు.

తరంతరాలుగా  శ్రీసభ ప్రభువు మరణం మరియు పునరుత్థాన జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుతుంది, దానికి ఇది ఒక సాక్షం, అత్యంత విలువైన నిధి  అని పోప్ అన్నారు 

దివ్యబలిపూజలో గురువుకు వారు చేస్తున్న సహాయ ,సహకారాలను ఆయన ప్రశంసించారు.

వత్తాసు బాలురు యాజక వృత్తి వైపు వెళ్ళటానికి శ్రద్ధ చూపాలని ప్రోత్సహిస్తూ,యేసుక్రీస్తు పిలుపు ఆలకించే మనసు కలిగి ఉండాలని వారిని ఉత్సాహపరిచారు. 

ఫ్రాన్స్‌లో మరియు ప్రపంచంలో గురువుల కొరత చాలా అవమానకరం అని పోప్ తన భాదను వ్యక్తపరిచారు  

పోప్ హాజరైన ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించి, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ముగించారు