పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుదల చూపుతుందని తెలిపిన హోలీ సీ

వైద్యుల సూచనల ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ కోలుకోవడం కొనసాగుతోందని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ మంగళవారం ఏప్రిల్ 8,2025 ఉదయం జర్నలిస్టులకు తెలిపింది.

ఆదివారం ఏప్రిల్ 6 ,2025 నాడు ఆరోగ్య సంరక్షణ కార్మికుల జూబ్లీ దివ్యబలి పూజ  ముగింపులో, పోప్ వేదికపై క్లుప్తంగా కనిపించి, జనసమూహాన్ని పలకరించి, ఆశీర్వదించి, "శుభ ఆదివారం, మరియు చాలా ధన్యవాదాలు" అని యాత్రికులకు చెప్పారు.

ద్వైపాక్షిక న్యుమోనియాకు దారితీసిన పాలీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత, కాసా శాంటా మార్టాలోని తన నివాసంలో పోప్ ఫ్రాన్సిస్ కోలుకుంటున్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుదలను చూపుతూనే ఉన్నారని ప్రెస్ ఆఫీస్ తెలియజేసింది.

పొప్ ఫ్రాన్సిస్ చలనశీలత మరియు శ్వాసకోశ సంబంధిత శారీరక చికిత్సను కొనసాగిస్తున్నారు;
పగటిపూట సాధారణ ఆక్సిజన్ స్వీకరిస్తునట్లు, రాత్రి సమయంలో, అవసరమైనప్పుడు నాసికా కాన్యులాలతో అధిక-ప్రవాహ ఆక్సిజనేషన్‌ను ఉపయోగిస్తున్నారు అని వారు తెలిపారు.

పోప్ ఫ్రాన్సిస్ తనకార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, డికాస్టరీస్ నుండి వివిధ పత్రాలను స్వీకరిస్తున్నారని మరియు అవసరమైనప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుతారని ప్రెస్ ఆఫీస్ తెలిపింది.

సోమవారం ఏప్రిల్ 7, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ను కాసా శాంటా మార్టాలో కలిశారు.