పవిత్ర భూమికి విరాళం ఇవ్వాలని కోరిన కార్డినల్ క్లాడియో

రానున్న పవిత్ర శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కతోలిక దేవాలయాలలో సేకరించే చందాను క్రీస్తు నడయాడిన పవిత్ర భూమికి అంకితమివ్వాలని తూర్పు దేశాల శ్రీసభ అధికార విభాగ ప్రతినిధి కార్డినల్ క్లాడియో Claudio , మార్చి 17న లేఖ ద్వారా విశ్వ శ్రీసభ పీఠాధిపతులను కోరారు.

సాక్షాత్తు క్రీస్తు నడయాడిన పవిత్ర భూమిని సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని,

ముఖ్యంగా హింసల వల్ల,యుద్దాల వల్ల పవిత్ర భూమి ఎంతగానో దెబ్బతిందని,అక్కడి ప్రజలు కూడా పేదరికంతో అలమటిస్తున్నారు

ఈ పవిత్ర శుక్రవారం నాడు సేకరించే చందా పవిత్ర భూమి అభివృద్ధికి, అక్కడి పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాటికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డినల్ పేర్కొన్నారు.

Tags