నియమ నిబంధనలు మించి మైనర్లను రక్షించమన్న పొప్ ఫ్రాన్సిస్

మార్చి 24-28 వరకు వాటికన్ లో పోంటిఫికల్ మైనర్ల రక్షణా విభాగం వారి వార్షిక ఆర్డినరీ ప్లీనరీ అసెంబ్లీని నిర్వహించింది
ఈ విభాగం వారు చేస్తున్న "విలువైన సేవ"కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విభాగం వారు స్థానిక శ్రీసభ మరియు సమాజానికి ప్రాణవాయువు లాంటివారని ప్లీనరీ అసెంబ్లీలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ఒక సందేశంలో అన్నారు.
ఒక పిల్లవాడు లేదా దుర్బల వ్యక్తి ఎక్కడైతే సురక్షితంగా ఉంటాడో, వారిలో మీరు క్రీస్తును సేవిస్తారు.
2014లో స్థాపించబడిన ఈ విభాగం వాటికన్ కార్యాలయాలు మరియు స్థానిక పీఠాధిపతుల సమావేశాల సహకారంతో వివిధ సంస్థలలో మైనర్ల రక్షణపై మరియు లైంగిక వేధింపులను నివారించే విధానాలపై పోప్‌కు సలహా అందిస్తారు.
జెమెల్లి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు మార్చి 20న సంతకం చేసిన తన సందేశంలో, పోప్ ఫ్రాన్సిస్ ఈ విభాగం చేస్తున్న పనిని ప్రోత్సహించాడు,
నివారణ విధానాలను ఏర్పాటు చేయడం ద్వారా మారుమూల సమాజాలలో ఉన్న ప్రతి బిడ్డ మరియు దుర్బల వ్యక్తి చర్చిలో భద్రతను పొందుతారనే సమిష్టి నిబద్ధతకు ఈ విభాగం దోహదపడుతుందని పొప్ అన్నారు