తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన అపోస్టోలిక్ జర్నీలో భాగంగా మూడవ దశను లోనికి అడుగు పెట్టారు. ఇండోనేషియా, పాపువా న్యూ గినియా పర్యటనలు విజయవంతంగా ముగించుకుని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం కతోలికులు అత్యధికంగా ఉన్నదేశమైన తైమూర్-లెస్టేను చేరుకున్నారు. తైమూర్-లెస్టే చేరుకున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారుని వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు.
దేశంలోని ప్రభుత్వ ప్రతినిధి బృందాలు మరియు 14 మంది సంప్రదాయ దుస్తులతో తైమూర్ అధ్యక్షుడు జోస్ మాన్యుయెల్ రామోస్-హోర్టా మరియు ప్రధాన మంత్రి క్సానానా గుస్మావోలు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి శుభాకాంక్షలు తెలిపిన వారి సంప్రదాయ కండువాను బహుమతిగా ఇచ్చారు.
అక్కడ నుండి బయలుదేరి డిలీలోని అపోస్టోలిక్ న్యాన్సియేచర్‌కు వెళ్లారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రయాణిస్తున్నప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా ఉండి, వాటికన్ తెలుపు మరియు పసుపు జెండాలను ఊపుతూ ఆయనను ఉత్సాహపరిచారు.
తైమూర్-లెస్టే సందర్శించిన రెండవ పాపుగారు
ఇండోనేషియా ఆక్రమణ సమయంలో 12 అక్టోబరు 1989న పునీత జాన్ పాల్ II తైమూర్-లెస్టేను సందర్శించారు. 2002లో ఈ పాక్షిక-ద్వీప ఆసియా దేశం ఇండోనేషియా నుండి స్వాతంత్య్రం పొందిన తర్వాత తైమూర్-లెస్టేను సందర్శించిన మొదటి పొప్ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు.
సెప్టెంబర్ 10న జరిగే దివ్య బలిపూజ లో సుమారు 700,000 మంది పాల్గొంటారని నిర్వాహుకులు వెల్లడించారు. దీనికి పొరుగున ఉన్న ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా నుండి కూడా విశ్వాసులు హాజరవుతారని భావిస్తున్నారు.
వికలాంగ పిల్లలను, స్థానిక మతాధికారులను, జెస్యూట్‌లను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కలుసుకోనున్నారు. చివరి రోజున దాదాపు 4,000 మంది తైమూర్ యువకులను కలవనున్నారు.
ఈ సందర్శన ద్వారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు శాంతి సందేశాన్ని తీసుకువస్తారని నేను ఆశిస్తున్నాను" అని 58 ఏళ్ల లెక్చరర్ ఫ్రాన్సిస్కో అమరల్ డా సిల్వా గారు అన్నారు.
2002లో తైమూర్-లెస్టే అధికారికంగా స్వతంత్రం పొందింది. క్రూరమైన ఇండోనేషియా ఆక్రమణ నుండి 200,000 కంటే ఎక్కువ మంది తైమూర్‌లు మరణించారు.రెండు దశాబ్దాల క్రితం స్వాతంత్య్రం పొందినప్పటి నుండి 1.3 మిలియన్ల మందిలో 98 శాతం మంది కతోలికులు తైమూర్-లెస్టేలో ఉన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer