ఘనంగా జరిగిన వేలాంగణిమాత మహోత్సవం

కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ పరిశుద్ధ వేళాంగణి మాత మహోత్సవం మే 10 ,2024 న ఘనంగా జరిగింది.

కర్నూలు మేత్రాసన నూతన పీఠకాపరి మహా పూజ్య శ్రీ శ్రీ శ్రీ గోరంట్ల జ్వానేసు గారు దివ్యబలి పూజను సమర్పించారు.

పీఠాధిపతులవారు "వేళాంగణి మాత/ఆరోగ్యమాత విశిష్ఠతను, మానవ రక్షణ చరిత్రలో ఆ మరియతల్లి పాత్రను" గురించి ప్రసంగించారు.

సుమారు 5000 మంది విశ్వాసులు, 26 మంది గురువులు, 40కన్యస్త్రీలు వేలాంగణి మాత పండుగ పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందారు

విచారణ కర్తలు, రెక్టర్ గురుశ్రీ కే.డి.జోసఫ్ గారు మేత్రానులకు, గురువులకు, మఠవాసులకు  తరలివచ్చిన విశ్వాసులకు మరియతల్లి ఆశీసులను మరియు కృతజ్ఞతలు తెలియచేసారు