ఘనంగా ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవం

ఘనంగా ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవం

హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్  విచారణలో గల ఆరోగ్యమాత  పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది.

వివిధ ప్రాతాలనుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. పండగ రోజు 8వ తేదీ 11గంటలకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని  గారు పండుగ దివ్యపూజాబలిని సమర్పించి ప్రజలను దీవించారు.

పండుగ జాగరణ దివ్యపూజాబలిని అర్ధరాత్రి 12 గంటలకు గురుశ్రీ మిరపకాయల కెన్నడీ గారు సమర్పించారు. మరియమాత పుట్టిన రోజు దివ్యపూజాబలిని ఉదయం 4 గంటలకు పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ మైఖేల్ సెల్వరాజ్ గారు సమర్పించారు.

సాయంత్రం 4 గంటలకు రంగురంగుల విద్యుద్దీపాలు, పూల అలంకరణతో అలంకరించిన ప్రత్యేక వాహనం పై మరియమాత స్వరూపాన్ని ఊరేగింపుగా దేవాలయం చుట్టూ తీసుకుని వెళ్లారు.అధిక సంఖ్యలో మరియమాత భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer