గోవా మరియు డామన్ అగ్రపీఠానికి 12 మంది నూతన గురువులు
గోవా మరియు డామన్ అగ్రపీఠం,సే కేథడ్రల్‌లో ఏప్రిల్ 29 మరియు 30 తేదీలలో పన్నెండు మంది డీకన్లను గురువులగా కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఫెర్రో గారు అభిషేకించారు.
గురుశ్రీ రుయెల్ క్లైడ్ ఫెర్నాండెజ్ (అసోల్నా), గురుశ్రీ క్రైస్ట్ రేయన్ డిసౌజా (వెల్సావో), గురుశ్రీ పీటర్ టైసన్ గొన్సాల్వేస్ (కాండోలిమ్), గురుశ్రీ డెజిల్ ఫెర్నాండెజ్ (అంబౌలిమ్), గురుశ్రీ క్లిఫోర్డ్ ఫెర్నాండెజ్ (అంబౌలిమ్), గురుశ్రీ వారెన్టో బెటాల్‌బాటిమ్), గురుశ్రీ బోరిస్ డయాస్ (కుంకోలిమ్), గురుశ్రీ వెనాన్సియో ఫెర్నాండెజ్ (అరంబోల్), గురుశ్రీ ఆంథోనీ మెల్విన్ గోమ్స్ (చిన్చిన్నిమ్), గురుశ్రీ క్లైవ్ ఆగ్నెలో డయాస్ (చిన్చిన్నిమ్), గురుశ్రీ జోవో గోన్సాల్వేస్ (గోవా-వెల్హా) మరియు గురుశ్రీ జోయెల్ రోడ్రిగ్స్ (డ్రామాపూర్) గార్లు నూతనంగా అభిషేకింపబడ్డారు.
విశ్వాసుల సేవలో యేసు పరిచర్యను కొనసాగించాలనే పవిత్రమైన పిలుపును గురువులు స్వీకరిస్తారని, యేసుప్రభు వలె సేవ చేసే కాపరులుగా ఉండాలని నూతన గురువులకు అగ్రపీఠాధిపతులు తెలిపారు
"సమర్థవంతమైన పరిచర్యకు వినయం మరియు ఐక్యత తప్పనిసరి సద్గుణాలు" అని ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షుడిగా ఎన్నికైన కార్డినల్ ఫెర్రో తెలిపారు.
తమ కుమారులను దేవునికి మరియు గోవా మరియు డామన్ అగ్రపీఠానికి సేవ చేయడానికి అందించినందుకు తల్లిదండ్రులు, విచారణ గురువులకు మరియు విశ్వాసులకు కార్డినల్ ఫెర్రో గారు కృతజ్ఞతలు తెలిపారు.