గోవాలో పునీత ప్రాన్సీస్ శౌరి వారి పవిత్ర అవశేషాల ప్రదర్శన
గోవాలో పునీత ప్రాన్సీస్ శౌరి వారి పవిత్ర అవశేషాల ప్రదర్శన
గోవా మరియు డామన్ అతి మేత్రాసనం పునీత ప్రాన్సీస్ శౌరి వారి (St Francis Xavier) యొక్క అవశేషాల ప్రదర్శనను ప్రకటించింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ ప్రదర్శన ఈ సంవత్సరం 21 నవంబర్ 2024న ప్రారంభమై 5 జనవరి 2025న ముగుస్తుంది. వేలాదిమంది ప్రజలను ఆకర్షించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు ప్రకటించారు.
పవిత్ర అవశేషాల ప్రదర్శనకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. కమిటీలో సాధారణ విశ్వాసులు, సిస్టర్స్ మరియు గురువులు ఉంటారు.
గోవా మరియు డామన్‌లోని విశ్వాసులకు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క పవిత్ర అవశేషాల ప్రదర్శన అనేది విశ్వాస మార్గంలో నడవడానికి మరియు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అని మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer