గాజా 'అనాగరికత'ను అంతం చేయాలని విజ్ఞప్తి చేసిన పోప్

జులై 20 ఆదివారం త్రికాల ప్రార్ధన అనంతరం గాజా నగరంలోని హోలీ ఫ్యామిలీ కతోలిక విచారణపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిపై నేను తీవ్ర విచారంను వ్యక్తం చేశారు మరియు గాజా స్ట్రిప్‌లో "అనాగరికతను వెంటనే ఆపాలని" పిలుపునిచ్చారు.
ఈ దాడిలో ముగ్గురు క్రైస్తవులు మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన Saad Issa Kostandi Salameh, Foumia Issa Latif Ayyad, and Najwa Ibrahim Latif Abu Daoud ల కోసం నేను ప్రార్థిస్తున్నాను.
వారి కుటుంబాలకు, మరియు విచారణలోని విశ్వాసులందరికీ నా సానుభూతిని తెలియ జేస్తున్నాను.
ఈ చర్య గాజాలోని పౌరులు మరియు ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న నిరంతర సైనిక దాడులకు అదనంగా చేరడం చాలా విచారకరం.
యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలని నేను మరోసారి పిలుపునిస్తున్నాను.
అంతర్జాతీయ సమాజం మానవతా చట్టాన్ని పాటించాలని, పౌరులను రక్షించే బాధ్యతను గౌరవించాలని, సామూహిక శిక్షలను, విచక్షణారహిత బలప్రయోగాన్ని, మరియు ప్రజల బలవంతపు స్థానభ్రంశాన్ని నిషేధించాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను.