క్రీస్తు బాప్తిస్మ దేవాలయాన్ని ప్రారంభించిన కార్డినల్ పరోలిన్
వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ శుక్రవారం 10 ,జనవరి 2025
న జోర్డాన్‌లోని అల్-మాగ్తాస్‌లో ఉన్న క్రీస్తు బాప్తిస్మ దేవాలయాన్ని ఆశీర్వదించి, ప్రారంభించి దివ్యబలి పూజను సమర్పించారు.
ఈ ప్రత్యేక సందర్భం క్రైస్తవులను నిజమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణలో పాల్గొనమని ఆహ్వానిస్తుందని కార్డినల్ పరోలిన్ అన్నారు
"బాప్తిస్మ యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చిన స్థలం ఇదే " అని అల్-మాగ్తాస్ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కార్డినల్ పరోలిన్ తన ప్రసంగంలో తెలిపారు.
సంఘర్షణలు మరియు యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య క్రైస్తవులు ఎదురుకుంటున్న కష్టాలకు
పోప్ ఫ్రాన్సిస్ తరపున కార్డినల్ సంఘీభావాన్ని తెలిపారు.
న్యాయమైన మరియు శాంతియుత సమాజాన్ని సాధించడంలో శ్రీసభ మద్దతును పునరుద్ఘాటిస్తూ, ఆశాజనకంగా ఉండాలని ఆయన వారిని కోరారు.
గాజాలో కాల్పుల విరమణ, ఖైదీల విడుదల మరియు మానవతా చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూనే ప్రపంచ నాయకులు శాంతి మరియు సహజీవనం కోసం కృషి చేయాలని కార్డినల్ పరోలిన్ కోరారు.
ఫాదర్ మిచెల్ పిసిసి 1990లో ఈ పవిత్ర స్థలాన్ని గుర్తించినప్పటి నుండి ఈ పవిత్ర స్థలాన్ని అంకితభావంతో నడిపిస్తున్నందుకు కార్డినల్ పరోలిన్ రాజకుటుంబానికి, ముఖ్యంగా రాజు అబ్దుల్లా II మరియు జోర్డాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.