కోల్‌కతాలో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యను ఖండించిన CBCI

కోల్‌కతాలో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యను ఖండించిన  CBCI

మహిళలకు న్యాయంమైన మరియు కఠినమైన భద్రతా చర్యలను తీసుకోవాలని "కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా" (CBCI)  ప్రభుత్వాన్ని కోరింది.  

CBCI ప్రెసిడెంట్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఆండ్రూస్ థాజత్ గారు మాట్లాడుతూ కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ  "31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై క్రూరమైన అత్యాచారం మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె పని ప్రదేశంలో జరిగిన ఈ భయంకరమైన చర్య, మన సమాజంలో మహిళల భద్రతకు ఉన్న తీవ్రమైన ముప్పులను ఎత్తి చూపుతోంది. బాధితురాలి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము మరియు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము అని ఈ భయంకరమైన నేరం మహిళలందరి గౌరవానికి భంగం కలిగించింది, మేము సత్వర న్యాయం మరియు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.

సిబిసిఐ సెక్రటరీ జనరల్, అగ్రపీఠాధిపతులు  అనిల్ కౌటో గారు  మాట్లాడుతూ, "మహిళల భద్రతకు  ప్రాధాన్యతనివ్వాలి. ఇలాంటి దుర్ఘటనలను నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము అని అన్నారు.

ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందు నిలబెట్టి, చట్ట ప్రకారం కఠిన శిక్షలతో శిక్షించాలని CBCI డిమాండ్ చేస్తోంది. అంకితభావం మరియు నిబద్ధతతో సమాజానికి సేవ చేసే వైద్య సోదరులకు, ముఖ్యంగా వైద్యులు మరియు నర్సింగ్ అధికారులకు మేము పూర్తి సంఘీభావంగా నిలుస్తాము అని ఈ సందర్భముగా తెలిపారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer