కతోలిక కుటుంబాలకు సంగోష్టిని నిర్వహించిన అలహాబాద్ మేత్రాసనం

అలహాబాద్ మేత్రాసనం, కుటుంబ సేవా విభాగం ఫిబ్రవరి 28, 2025న ప్రయాగ్‌రాజ్‌లోని సాధన సదన్‌లో " కుటుంబాల పునాదిని విశ్వాసంలో బలోపేతం చేయడం" అనే శీర్షికతో సంగోష్టి నిర్వహించింది.
మేత్రాసనంలోని నాలుగు జోను ల నుండి దాదాపు 70 మంది ఈ సంగోష్టికి హాజరయ్యారు. అలహాబాద్ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య లూయిస్ మస్కరెన్హాస్ (Louis Mascarenhas) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు
పవిత్ర గ్రంధం(బైబిల్) ఊరేగింపు,పవిత్ర గ్రంథ పఠనం మరియు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
కుటుంబ సేవ విభాగం డైరెక్టర్ గురుశ్రీ ఇవాన్ క్రాస్టా నేతృత్వంలో జరిగిన ఈ సంగోష్ఠి మొదటి సెషన్ "విశ్వాస నిర్మాణంలో కతోలిక కుటుంబాల పాత్ర" పై దృష్టి సారించారు.
వైవాహిక నిబద్ధత, సామాజిక బాధ్యతలు మరియు విశ్వాసం-కేంద్రీకృత జీవనం వంటి అంశాలపై వారు చర్చించారు.
ఈ సంగోష్ఠిలో నేర్చుకున్న పాఠాలను వారి కుటుంబాలలో అమలు చేయమని కుటుంబాలను ప్రోత్సహిస్తూ మహా పూజ్య మస్కరెన్హాస్ మరియు గురుశ్రీ స్టీఫెన్ మనోజ్ ముగింపు వ్యాఖ్యలతో సంగోష్ఠి ముగిసింది.