ఎనిమిదవ ఆర్థిక నిర్వాహకుల కోర్సును నిర్వహిస్తున్న CCBI
![](/sites/default/files/styles/max_width_770px/public/2025-02/v9_5_0.png?itok=jE4Bi8gr)
CCBI ఎక్స్టెన్షన్ సెక్రటేరియట్ అయిన శాంతి సదన్ లో మహిళా మత సభల ప్రాంతీయ ఆర్థిక నిర్వాహకుల కోసం ఆర్థిక నిర్వహణ శిక్షణా కార్యక్రమం ఎనిమిదవ బ్యాచ్‌ను ఫిబ్రవరి 11-15, వరకు నిర్వహిస్తోంది.
ఈ కోర్సులో 12 సభల నుండి 36 మంది మఠకన్యలు పాల్గొంటున్నారు.
కతోలిక సంస్థలలో ఆర్థిక పారదర్శకత మరియు నిర్వహణను పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు.
శాంతి సదన్ నిర్వాహకుడు గురుశ్రీ డ్యూమింగ్ గోన్సాల్వ్స్ సమావేశానికి స్వాగతం పలికి, వ్యాఖ్యాతలను పరిచయం చేశారు.
ప్రారంభ ప్రార్థనకు గురుశ్రీ అరుల్‌రాజ్ గాలి CSC ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
ఆర్థిక నిర్వహణలో పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను గురుశ్రీ డాక్టర్ అలిక్సో మెనెజెస్ తెలియపరిచారు
మత సభలు మరియు అనుబంధ సంస్థలలో విశ్వసనీయతను పెంపొందించడంలో దాని పాత్రను వివరించారు
గోవాలోని శాంతి సదన్ కాథలిక్ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులను అందిస్తుంది.
వీటిలో మేత్రాసన మరియు ప్రాంతీయ ఆర్థిక నిర్వాహకుల కోసం ఆర్థిక నిర్వహణ కోర్సు మరియు వికార్ జనరల్స్ మరియు ఛాన్సలర్ల కోసం రూపొందించిన మేత్రాసన పరిపాలన కోర్సు ఉన్నాయి.