ఉక్రెయిన్ అధ్యక్షుడుకి సందేశాన్ని పంపిన పోప్ లియో

ఆగస్టు 24న ఉక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా పోప్ లియో సందేశాన్ని పంపారు  

34 సంవత్సరాల క్రితం అనగా 1991లో Soviet Union నుండి ఉక్రెయిన్ స్వతంత్ర పొందిన రోజిది.

యుద్ధం ఉద్రిక్తతలతో వున్నా సమయంలో జెలెన్స్కీ Donald Trump, Xi Jinping, England,  స్పెయిన్ రాజులు మరియు అనేక ప్రపంచ నాయకుల నుండి సందేశాలను అందుకున్నారు

హింస మరియు యుద్ధంతో నిండిన తన దేశాన్ని చూసి మనోవ్యధతో ఉన్న ఉక్రెయిన్ నాయకుడికి ప్రార్థనా హామీ ఇస్తూ పోప్ తన లేఖను ప్రారంభించారు.

యుద్ధం వల్ల బాధపడుతున్న వారికి, గాయపడినవారికి, ప్రియమైన వారిని కోల్పోయినవారికి మరియు నిరాశ్రయుల కొరకు ప్రార్థిస్తున్నా అని పోప్ అన్నారు

దేవుడే వారిని ఓదార్చుగాక; గాయపడిన వారిని బలపరచుగాక మరియు మరణించిన వారికి శాశ్వత విశ్రాంతిని ప్రసాదించుగాక. 

మంచి సంకల్పంగల వారి హృదయాలను కదిలించమని, ఆయుధాల ఘోష నిశ్శబ్దంగా మారి సంభాషణకు దారితీయాలని, అందరి మంచి కోసం శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని నేను ప్రభువును ప్రార్థిస్తున్నాను.

పోప్ లియో XIV తన పోప్ పదవి ప్రారంభం నుండి ఉక్రెయిన్‌లో శాంతి కోసం పిలుపునిచ్చాడు. 

ఆయన జెలెన్స్కీని రెండుసార్లు కలిశారు మరియు అనేక సందర్భాల్లో శాంతి చర్చలకు వాటికన్‌ను వేదికగా అందించారు.