అస్సాం వరద బాధితులకు సహాయం
అస్సాం వరద బాధితులకు సహాయం
అస్సాంలో వరద బాధిత కుటుంబాల కోసం కమ్యూనియో మరియు అవిరల్ ఔట్‌రీచ్ సొసైటీ CCBI కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ మైగ్రెంట్స్(CCBI Commission for Women and Migrants ) ద్వారా సహాయక సేవలును అందించారు.
డిబ్రూగఢ్ మేత్రాసనం, బిషప్ హౌస్(Bishop house) నుండి వచ్చిన బృందాలు పానీబురా అనే గ్రామంలో సహాయక సేవలును అందించారు. వరద బాధితులకు ఆహార పదార్థాలను పంపిణీ చేసారు.
పానీబురాలోని దాదాపు 200 కుటుంబాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చాలామంది తమ ఇల్లు ,పంట భూములు దెబ్బతిని సర్వం కోల్పోయారు.
సహాయక చర్యలలో భాగంగా వారందరికీ నిత్యావసరాల వస్తువులు బియ్యం, బంగాళదుంపలు, పప్పు, ఉప్పు మరియు నూనెలను వారికీ అందించారు.ఈ బృందంలో బిషప్ హౌస్ నుండి సిబ్బంది మరియు సిస్టర్స్, వాలంటీర్లు, స్థానిక నాయకులు మరియు మహిళా కమిషన్ సభ్యులు మరియు యువజన డైరెక్టర్లు ఉన్నారు.
ఈ బృందం ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలను గుర్తించేందుకు సర్వే నిర్వహించి పానీబురాకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పానీబురా గ్రామం నీట మునిగిపోయింది, దీనివల్ల ఇళ్లు కూలిపోతాయి అని నివాసితులు రోడ్డు పక్కన నివసించవలసి పరిస్థితి వచ్చింది.
కార్యక్రమంలో పాల్గొన్న సిస్టర్స్ ఇతరులతో కలసి అరటి కాండం, ఇతర చెక్కల నుండి పడవలను నిర్మించి నివాసయోగ్యంగా లేని ఇళ్లకు ఆహార పదార్థాలను రవాణా చేసారు . సిస్టర్స్ ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి ప్రజల వద్దకు వెళ్లారు. అండగా మేమున్నాం అని భరోసా ఇచ్చారు.
గురుశ్రీ ఫిలిప్ పుర్టీ మరియు గురుశ్రీ సంజీవ్ ఎక్కా కమిషన్ సభ్యులతో కలిసి బాధిత కుటుంబాలను సందర్శించి, బాధిత కుటుంబాల ముందుగా తయారుచేసిన జాబితా ఆధారంగా అవసరమైన వస్తువులను అందించారు. ఈ సహాయ కార్యక్రమం కొనసాగుతుందని బృంద సభ్యులు తెలిపారు.
అస్సాంలో వరద (Assam Floods) బీభత్సం ఇంకా కొనసాగుతోంది. వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసాయి.ఈ వరదలులో 27 జిల్లాలు నీట మునిగాయి,18 లక్షలకు పైగా బాధితులు, 70 మందికి పైగా మరణించారు అని అధికారులు తెలిపారు.
కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా ఆరు అరుదైన ఖడ్గమృగాల సహా 130కి పైగా జంతువులు మరణించినట్లు జూ అధికారులు తెలిపారు. కజిరంగా నేషనల్ పార్క్ పులుల అభయారణ్యం.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer