అంతర్జాతీయ శాంతి సమావేశంలో పాల్గొన పోప్ లియో

Sant’Egidio కమ్యూనిటీ నిర్వహించిన అంతర్జాతీయ శాంతి సమావేశానికి పోప్ లియో మంగళవారం అక్టోబర్ 28 సాయంత్రం రోమ్‌ Colosseum కు చేరుకొని ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన నాయకులతో కలిసి ప్రార్ధించారు.

ఈ కార్యక్రమం ప్రారంభంలో, అలెగ్జాండ్రియా మరియు ఆల్ ఆఫ్రికా Patriarch యుద్ధంతో నలిగిపోతున్న అనేక దేశాల పేర్లను పఠించాడు,పోప్ లియో మరియు ఇతర బిషప్‌లు వారికొరకు ప్రార్ధించారు.

వారు Constantine ARCH ముందు ఏర్పాటు చేసిన వేదిక దాగరకు ఊరేగింపులో చేరి, వివిధ మతాల ప్రతినిధులు వారి వారి సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేశారు.

సూడాన్‌కు చెందిన OMER MALLA ALI ఓ వైద్యుడు మరియు శరణార్థి తమ పరిస్థితిని గురించి మాట్లాడారు 

రెండు సంవత్సరాలకు పైగా ఆహారం, మందులు మరియు ఆశ లేకుండా ముట్టడిలో ఉన్న ప్రజలు. తల్లులు తమ పిల్లలను బతికించడానికి జంతువుల ఆహారాన్ని తినిపిస్తారు. 

బుల్లెట్ల వల్ల చంపబడని వారు ఆకలితో నెమ్మదిగా చనిపోతారు. 

దయచేసి, సూడాన్ కోసం ప్రార్థించండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను 

శాంతి స్థాపన కోసం మరియు యుద్ధాలకు ముగింపు పలకాలని పోప్ పిలుపునిచ్చారు

పోప్ మరియు అనేక మంది ప్రతినిధులచే శాంతి కొవ్వొత్తులను వెలిగించడం జరిగింది.