రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్

సోమవారం అక్టోబర్ 20 ఉదయం వాటికన్‌లో రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా ప్రధాన మంత్రి శ్రీ Nikol Pashinyanతో పోప్ సమావేశమైయ్యారు 
 
పోప్‌తో సమావేశం తర్వాత హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రధాన మంత్రి వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో సమావేశమయ్యారు, వీరితో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ కూడా ఉన్నారు.

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా హోలీ సీ మరియు పురాతన క్రైస్తవ సంప్రదాయం కలిగిన దేశమైన అర్మేనియా మధ్య మంచి సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయబడింది.

వీరిరువురు ఇతర సమస్యలపై, ముఖ్యంగా దక్షిణ కాకసస్‌లో  శాశ్వత శాంతి అవసరాన్ని చర్చించినట్లు హోలీ సి ప్రెస్ ఆఫీస్ పేర్కొంది