ప్రపంచ వేదవ్యాపక ఆదివార వీడియో సందేశం విడుదల చేసిన పోప్

"ప్రపంచంలోని ప్రతి కతోలిక విచారణ వేదవ్యాపక ఆదివారాన్ని జరుపుకోవాలని పిలుపునిస్తూ పోప్ లియో ఒక వీడియో సందేశం విడుదలచేశారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ నుండి చివరి ఆదివారం వరకు ప్రపంచ వేదవ్యాపక  ఆదివారం జరుగుతుంది. 

ఈ సంవత్సరం ఇది అక్టోబర్ 19న "ప్రజలందరి మధ్య నమ్మికకు ప్రేషితులు" అనే ఇతివృత్తంతో జరుగుతుంది.

"నేను పెరూలో గురువుగా మరియు పీఠాధిపతిగా పనిచేసినప్పుడు వేదవ్యాపక  ఆదివారం రోజున విశ్వాసులు చూపిన విశ్వాసం, ప్రార్థన మరియు దాతృత్వం తమ సమాజాలను ఎలా మార్చగలవో నేను ప్రత్యక్షంగా చూశాను." అని పోప్ అన్నారు 

వేదవ్యాపక  ఆదివారం "మీ ప్రార్థనలు, మీ మద్దతు సువార్తను వ్యాప్తి చేయడానికి, మతసంబంధమైన మరియు సత్యోపదేశ విధివిధానాలను అందించడానికి, నూతన దేవాలయాలను నిర్మించడానికి,ఆరోగ్యం మరియు విద్యా అవసరాలను చూసుకోవడానికి సహాయపడుతుంది" అని పోప్ అన్నారు 

జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు దీనిలో భాగస్తులై ప్రార్ధించాలని,సత్య సువార్తను వ్యాప్తి  చేయడానికి పూనుకోవాలని పోప్ఆదేశించారు..