మెట్రోపాలిటన్ ఆఫ్ బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి నూతన అధ్యక్షుల సన్మాన సభ
24 సెప్టెంబర్ 2024న హైదరాబాద్,శివరాంపల్లి హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ (HMI) నందు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్‌లు (APCC) మరియు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చ్‌ల (TCC) సహకారంతో మెట్రోపాలిటన్ ఆఫ్ బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ (BEC),కు నూతనంగా ఎన్నికైన మోరన్ మోర్ శామ్యూల్ థియోఫిలస్ గారిని సత్కరించారు
ఈ సత్కార వేడుకలో కరీంనగర్‌లోని CSI బిషప్ మరియు CSI సినడ్ తాత్కాలిక మోడరేటర్ రెవ. రూబెన్ మార్క్, రాయలసీమలో CSI బిషప్ రెవ. ఇస్సాక్ వరప్రసాద్, APCC వైస్ ప్రెసిడెంట్ మరియు ICM చర్చి, ఏలూరు ప్రైమేట్ బిషప్ రెవ. జాన్ S.D. రాజు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చ్స్ ఇన్ ఇండియా (NCCI) వైస్ ప్రెసిడెంట్ మరియు HMI డైరెక్టర్ రెవ. డా. ప్యాకియం శామ్యూల్,TCC ప్రధాన కార్యదర్శి రెవ. డాక్టర్ T. భాస్కర్, APCC ప్రధాన కార్యదర్శి- డాక్టర్ జి. శామ్యూల్ సుధీర్, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిస్ (ఎఫ్‌టిసి) కార్యదర్శి గురుశ్రీ కె. అంతయ్య గారు ,తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ మరియు వివిధ క్రైస్తవ మతపెద్దలు పాల్గొని బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్‌కు ఎన్నికైన మోరన్ మోర్ గారిని అభినందనలు మరియు సన్మానించారు.
బీఈసీ హైదరాబాద్ డయాసెస్ వికార్ జనరల్ రెవ. వరప్రసాదరావు గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు
బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ అనేది భారతీయ మూలానికి చెందిన చర్చి, ఇది కేరళ రాష్ట్రం వారు ప్రపంచవ్యాప్తంగా సమ్మేళనాలు మరియు పారిష్లతో కూడిన పరిపాలనాపరంగా ఉంది.
బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ 14 దేశాలలో 57 డియోసెస్‌లు ఉన్నాయి. 14 దేశాలలో 3.5 మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నారు.దీనికి 30 మంది బిషప్‌లు ఉన్నారు
మే 08, 2024న మెట్రోపాలిటన్ బిషప్ మోరన్ మోర్ అథనాసియస్ యోహాన్ I గారు పరమపదించినందున ఈ స్థానానికి మోర్ శామ్యూల్ థియోఫిలస్ గారు ఎన్నుకోబడ్డారు అని అంతర్మత సమాలోచన సేవ విభాగ ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు తెలియచేసారు.