మనీలాలో అర్చకత్వ వేదాంతశాస్త్రంపై అంతర్జాతీయ సమావేశం

రెండు కాథలిక్ ఉన్నత విద్యా సంస్థలు-డొమినికన్ వారు నడిపించే యూనివర్శిటీ ఆఫ్ శాంటో టోమస్ (UST) మరియు అటెనియో డి మనీలా విశ్వవిద్యాలయం-ఫిబ్రవరి 13–14, 2024న అర్చకత్వ ( ప్రీస్ట్హుడ్ ) వేదాంతశాస్త్రంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాయి.

యూనివర్శిటీ ఆఫ్ శాంటో టోమస్‌లోని బ్లెస్డ్ పీర్ జార్జియో ఫ్రాస్సాటి భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.

గురుత్వం ఎల్లప్పుడు దేవుని మహిమ కొరకు, అందరి శ్రేయస్సు కొరకు, సమాజ సేవలో ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వక్తలు పునరుద్ఘాటించారు.

మొదటి రోజు (ఫిబ్రవరి 13), డిక్యాస్టరీ ప్రిఫెక్ట్ ఎమెరిటస్ కార్డినల్ మార్క్ ఔల్లెట్ గారు, “అర్చకత్వం భవిష్యత్తు ఏమిటి?” అనే శీర్షికతో తన ప్రధాన ఉపన్యాసం చేశారు.

ప్రపంచంలో కాలక్రమేణా సామాజిక, మతపరమైన మరియు సాంస్కృతిక మార్పులు ఉన్నప్పటికీ, దేవుని మరియు ప్రజలకు సేవ చేయడం అర్చకత్వం యొక్క సారాంశం అలాగే ఉంది అని కార్డినల్ గారు అన్నారు.

UST ఫాకల్టీ ఆఫ్ సేక్రేడ్ థియాలజీ మాజీ డీన్ అయిన డొమినికన్ గురుశ్రీ రోడెల్ ఈ. అలిగాన్ "ఫిలిప్పీన్స్‌లో గురువుల దైవ పిలుపు మరియు ఏర్పాటు" గురించి మాట్లాడారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే ఫిలిప్పీన్స్‌లో దైవాంకితుల తగ్గుతున్నారు  గురువిద్యాలయంలో చేరడానికి యువతను ప్రోత్సహించడం మరియు ప్రేరేపించడం అవసరం అని గురుశ్రీ అలీగాన్ అన్నారు.

డికాస్టరీ ఫర్ ఎవాంజలైజేషన్ ప్రో-ప్రిఫెక్ట్ అయిన కార్డినల్ లూయిస్ ఆంటోనియో జి. టాగ్లే "సాంఘిక ప్రసార మాధ్యమం మరియు సువార్త ప్రచారం"పై ప్రసంగించారు.

చివరగా, లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీకి చెందిన డాక్టర్ కార్మెన్ వాల్డెస్ కూడా "పర్యావరణ సారథ్యంలో గురువుల పాత్ర"ను వివరించారు.

Tags