ఢిల్లీలో యువతా సదస్సును నిర్వహించిన ICYM

ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ (ICYM) ఢిల్లీ సౌత్ జోన్ 2 ఫిబ్రవరి 23న సెయింట్ ఫిలిప్స్ దేవాలయంలో సమావేశం అయ్యారు.

ఢిల్లీ సౌత్ రెండవ జోన్ లోని ఆరు విచారణల నుండి 100-120 మంది యువకులు పాల్గొన్నారు 

ఈ కార్యక్రమం దివ్యబలి పూజతో ప్రారంభమై, హాజరైన వారిలో విశ్వాసం మరియు ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించింది. 

DEXCO జోనల్ ఇన్‌ఛార్జ్ జస్టిన్ ఆకాష్ ఈ  కార్యక్రమినికి యువతను స్వాగతిస్తూ  శ్రీసభలో  యువత పాత్రను  వివరించారు 

కీర్తి లతా బోద్రా నేతృత్వంలో మానసిక ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణపై ఒక సెషన్ జరిగింది

యువత తమ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని మరియు వారి సమాజాలకు చురుకుగా సహకరించాలని మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ మరియ అంతోని తెలిపారు.

యువత తమ విశ్వాసాన్ని మరింత దృఢ నిశ్చయంతో జీవించాలని ప్రేరేపిస్తూ,తమ దైనందిన జీవితంలో క్రీస్తు సాక్షులుగా ఉండాలని ఉదేశంతో ముగ్గించారు.