హైదరాబాద్‌లో క్రైస్తవ యువతులపై దాడి ఘటన

హైదరాబాద్‌లో క్రైస్తవ యువతులపై దాడి ఘటన 

తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని అల్మాస్‌గూడ (మీర్‌పేట్) ప్రాంతంలో ఇద్దరు క్రైస్తవ యువతులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సమాచారం.

వివరాలలోకి వెళ్తే  అల్మాస్‌గూడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఈ ఘటన జరిగింది. యువతులు ఇద్దరూ తమ బంధువులను (అత్తను) కలవడానికి వెళ్లిన సమయంలో, కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. చాక్లెట్లు ఇస్తూ పాఠశాల పిల్లలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలతో ఈ దాడికి పాల్పడ్డారు. తాము మతమార్పిడులు చేయడం లేదని, బంధువుల ఇంటికి వచ్చామని బాధితులు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ వినకుండా, వారి బ్యాగ్ లను చెక్ చేస్తూ , నిందితులు అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై పదే పదే భౌతిక దాడికి (చేయిచేసుకోవడం, కొట్టడం) పాల్పడ్డారు.

ఈ దాడికి సంబంధించిన వీడియో 2026 నవంబర్ 3న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు నిరసనగా  క్రైస్తవ సంఘాలు మీర్‌పేట్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. 

ఎవరైనా మతమార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కానీ మహిళలపై చేయి చేసుకోవడం, కొట్టడం, అవమానించడం చట్టవిరుద్ధం.మతం ఏదైనా కావచ్చు, మహిళల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image