స్పెయిన్ మరియు అండోరాకు అపోస్టోలిక రాయబారిని నియమించిన పోప్

సెప్టెంబర్ 15 న ఆర్చ్ బిషప్ Piero Pioppoను స్పెయిన్ మరియు ఐబీరియన్ ద్వీపకల్పంలోని సార్వభౌమ దేశమైన అండోరా ప్రిన్సిపాలిటీకి అపోస్టోలిక రాయబారిగా పొప్ లియో నియమించారు 

ఈయన ఇండోనేషియా & ASEAN (ఆగ్నేయాసియా దేశాల సంఘం) కు, Cameroon  మరియు ఈక్వటోరియల్ గినియాలో కూడా పోప్ అపోస్టోలిక రాయబారిగా పనిచేసిన విస్తృత అనుభవం కలిగి ఉన్నారు.

ఆర్చ్ బిషప్ Piero 1960లో ఉత్తర ఇటలీలోని సావోనాలో జన్మించారు.

డాగ్మాటిక్ థియాలజీలో డాక్టరేట్ డిగ్రీని పొందారు, 1985లో ఇటలీలోని Acqui Terme మేత్రాసనానికి అభిషేకింపబడ్డారు 

అతను 1993లో హోలీ సీ దౌత్య సేవలో చేరారు మరియు సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ కొరియా, చిలీ దేశాలలో తన సేవను అందించారు

2006లో Institute for the Works of Religionకు ప్రిలేట్‌గా నియమితులయ్యారు.

2010 లో Torcello Titular ఆర్చ్ బిషప్‌గా నియమితులయ్యారు అలాగే 25 జనవరి 2010న కామెరూన్ మరియు ఈక్వటోరియల్ గినియాకు పొప్ రాయబారిగా  నియమితులై, అదే సంవత్సరం మార్చిలో అగ్రపీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.

పోప్ ఫ్రాన్సిస్ 2017 సెప్టెంబర్‌లో ఇండోనేషియాకు అపోస్టోలిక్ నన్సియోగా మరియు మరుసటి సంవత్సరం ASEANకు అపోస్టోలిక్ నన్సియోగా ఆర్చ్ బిషప్ పియోప్పోను నియమించారు.

వీరు ఇటాలియన్, ఆంగ్లము, ఫ్రెంచ్ మరియు స్పానిష్ మాట్లాడgalaru