సిబిసిఐ కార్యవర్గ సభ్యుల ఎన్నిక

బెంగుళూరు,ఫిబ్రవరి 6, 2024 (CBCI): కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI)
సర్వ సభ్య సమావేశం ఆరవ రోజున  
త్రిచూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఆండ్రూస్ థాజత్  గారు 2024-2026 సంవత్సరాలకు సీబీసీఐ  అధ్యక్షుడిగా మరలా ఎన్నికయ్యారు, 
మద్రాస్-మైలాపూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జార్జ్ అంతోనిసామి మొదటి ఉపాధ్యక్షులుగా,
బతేరి పీఠాధిపతులు మహా పూజ్య జోసెఫ్ మార్ థామస్ గారు రెండవ ఉపాధ్యక్షులుగా మరియు  
ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య అనిల్ జోసెఫ్ టోమస్ కూటోను గారిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య యొక్క 36 వ సర్వ సభ్య సమావేశం "దేశంలో ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులకు చర్చి యొక్క ప్రతిస్పందన మరియు కృత్రిమ మేధస్సు యొక్క ప్రయోజనాలు మరియు సవాళ్లు," అనే నేపథ్యంపై జరిగుతున్నాయి. ఈ సమావేశంలో సభ్యులు అనేక అంశాలను గూర్చి చర్చించనున్నారు.

సీబీసీఐ అధ్యక్షులు  : మహా పూజ్య ఆండ్రూస్ థాజత్

వీరు 13 డిసెంబర్ 1951న త్రిచూర్ జిల్లాలోని పుదుక్కాడ్‌లో జన్మించారు. 
14 మార్చి 1977న త్రిచూర్ అగ్రపీఠం పూజారిగా అభిషేకింపబడ్డారు. 
తను వేదాంతశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని మరియు రోమ్,పాంటిఫిక్ ఓరియంట్‌లో పాంటిఫిక్ ఇన్స్టిట్యూట్ (DOCL)లో డాక్టర్ డిగ్రీని కలిగి ఉన్నారు.
అతను ఎర్నాకులంలోని సిరో-మలబార్ మేజర్ ఆర్కిపిస్కోపల్ ఆర్డినరీ ట్రిబ్యునల్ - అంగమలీ, ఆర్కిపార్కీ యొక్క సిన్సెల్లస్‌కు అధ్యక్షుడిగా, జీవన్ టెలికాస్టింగ్ కార్పొరేషన్ వర్కింగ్ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు ఓరియంటల్ కానన్ లా సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నప్పుడు 19 మార్చి 2004న త్రిచూర్ అగ్రపీఠానికి సహాయ పీఠాధిపతిగా నామినేట్ చేయబడ్డారు.
1 మే 2004న అగ్రపీఠాధిపతులుగా నియమింపబడి, 22 జనవరి 2007న త్రిచూర్ అగ్రపీఠాధిపతులుగా అభిషేకింపబడ్డారు. 
కేరళ కాథలిక్ బిషప్ కౌన్సిల్ (KCBC) సెక్రటరీ జనరల్ మరియు అద్యక్షులుగాను మరియు KCBC ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షులుగా, సిబిసిఐకి మొదటి ఉపాధ్యక్షులుగా తన సేవను అందించారు 
పోప్ ఫ్రాన్సిస్ గారు ఆండ్రూస్ గారిని  2021లో పోంటిఫికల్ కౌన్సిల్ ఫర్ లెజిస్లేటివ్ టెక్ట్స్ సభ్యులలో ఒకరిగా నియమించారు. 
పోంటిఫికల్ కౌన్సిల్ ఫర్ లెజిస్లేటివ్ టెక్స్ట్స్ అనేది రోమన్ క్యూరియా యొక్క డికాస్టరీ, ఇది చర్చి చట్టాలను వివరిస్తుంది. 
మహా పూజ్య ఆండ్రూస్ థాజత్ ఓరియంటల్ కోడ్ ఆఫ్ కానన్ లాలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నిపుణుడు.

మొదటి ఉపాధ్యక్షులుగా : మహా పూజ్య జార్జ్ అంతోనిసామి

1952 ఫిబ్రవరి 15న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించారు. 
రోమ్,అర్బన్ విశ్వవిద్యాలయము నుండి వేదాంత అధ్యయనాలను పూర్తి చేసారు. 
19 నవంబర్ 1980న తిరుచ్చిలో గురువుగా అభిషేకింపబడ్డారు నియమితుడయ్యాడు. ట్రిచీలోని హోలీ రిడీమర్స్ మైనర్ బాసిలికాలో సహాయక విచారణ గురువుగా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత, పొంటిఫికల్ ఎక్లెసియల్ అకాడమీలో ఉన్నత చదువుల కోసం రోమ్‌కు పంపబడ్డారు.
2002లో, పోప్ సెయింట్ జాన్ పాల్ II అతన్ని జోర్డాన్‌లోని వాటికన్ రాయబార కార్యాలయానికి ఛార్జ్ డి'అఫైర్స్‌గా నియమించారు. 
4 ఆగష్టు 2005న, పోప్ బెనెడిక్ట్ XVI చేత ఇటలీలోని సార్డినియాలోని సుల్సీకి నామమాత్రపు అగ్రపీఠాధిపతిగా నియమించబడ్డాడు మరియు 21 సెప్టెంబర్ 2005న ట్రిచీలో తన ఎపిస్కోపల్ ఆర్డినేషన్ పొందాడు. అతను ఏకకాలంలో గాంబియా, లైబీరియా, గినియా మరియు సియెర్రా లియోన్‌లకు అపోస్టోలిక్ న్యూన్షియోగా నియమితులయ్యారు.
పోప్ బెనెడిక్ట్ XVI 21 నవంబర్ 2012న మద్రాస్ మరియు మైలాపూర్ అగ్రపీఠాధిపతిగా నియమించారు.
అతను 2019 నుండి 2023 వరకు మూడు సార్లు CCBI వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అతను 2015 నుండి 2019 వరకు CCBI కమీషన్ ఫర్ కానన్ లా మరియు లెజిస్లేటివ్ టెక్స్ట్‌లకు మాజీ ఛైర్మన్‌గా ఉన్నారు. 
బెంగళూరు సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛైర్మన్‌గా 2020 నుండి ఉన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ గారు 17 నవంబర్ 2020న కాంగ్రెగేషన్ ఫర్ ది ఎవాంజెలిసాటిన్ అఫ్ పెఒప్లె సభ్యులలో ఒకరిగా నియమించారు.

రెండవ ఉపాధ్యక్షులు : మహా పూజ్య జోసెఫ్ మార్ థామస్

మే 13, 1952న పాతానంతిట్ట జిల్లాలోని వడసెరిక్కర గ్రామంలో జోసెఫ్ కొన్నాత్‌గా జన్మించారు. 
జూన్ 1968లో సెయింట్ అలోసియస్ సెమినరీలో చేరారు. 
వేదాంతశాస్త్రం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ఆల్వేలోని పొంటిఫికల్ సెమినరీలో చేరారు.
తను డిసెంబరు 23, 1978న గురువుగా అభిషేకింపబడ్డారు, వివిధ విచారణలో పనిచేశారు.  
1979లో, అతను కడపకాడలోని సెయింట్ థామస్ మలంకర కాథలిక్ చర్చి మొదటి రెసిడెంట్ వికార్‌గా కొల్లం (కడప్పక్కడ)కి పంపబడ్డారు .
1986 నుండి త్రివేండ్రంలోని మార్ ఇవానియోస్ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశాడు. 
మైనర్ సెమినరీలో ఆరు సంవత్సరాల సేవను పూర్తి చేసిన తర్వాత, అతను త్రివేండ్రం చర్చి జిల్లా వికార్‌గా మరియు పట్టంలోని సెయింట్ మేరీస్ మెట్రోపాలిటన్ చర్చి వికార్‌గా నియమితులయ్యారు.
1998లో, అతను కేరళ యూనివర్సిటీ సెనేట్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సెనేట్ సభ్యుడు అయ్యారు. 
2000లో, కేరళ ప్రభుత్వ విద్యా మంత్రి నేతృత్వంలోని స్కూల్ కరికులం కమిటీలో సభ్యునిగా నియమించబడ్డారు .
జనవరి 5, 2005న పోప్ జాన్ పాల్ II గారు త్రివేండ్రం సహాయక పీఠాధిపతిగా మరియు ఉత్తర అమెరికా మరియు ఐరోపాకు అపోస్టోలిక్ విజిటర్‌గా నియమించారు. 
ఫిబ్రవరి 19, 2005న సెయింట్ మేరీస్ కథడ్రల్ చర్చిలో పీఠాధిపతిగా నియమితులయ్యారు. 
మహా పూజ్య జోసెఫ్ థామస్ బతేరి ఎపార్కీకి మూడవ పీఠాధిపతిగా నియమితులయ్యారు. 

సిబిసిఐ కార్యదర్శిగా : మహా పూజ్య అనిల్ జోసెఫ్ కూటో

సెప్టెంబరు 22, 1954న గోవా అగ్రపీఠం బార్దేజ్‌లోని పోర్వోరిమ్ గ్రామంలో జన్మించారు. 
1967లో గోవాలోని మైనర్ సెమినరీలో చేరారు. 
1973లో ఫిలాసఫీని పూర్తి చేసారు మరియు 1976లో బాయ్స్ టౌన్, ప్రేమ్ నగర్, క్యూపెమ్, గోవాలో రీజెన్సీ చేసారు. 
1977లో ఆయన ఢిల్లీ అగ్రపీఠంలో చేరారు మరియు 1981లో విద్యాజ్యోతి కాలేజ్ ఆఫ్ థియోలాజికల్ స్టడీస్ నుండి థియాలజీ స్టడీస్ పూర్తి చేశారు.
ఫిబ్రవరి 8, 1981న గురువుగా అభిషేకింపబడ్డారు. 
1981లో తను వారణాసిలో మిషన్ అనుభవం కోసం వెళ్ళాడు. 
1982లో (నాలుగు నెలలు) అతను సెయింట్ జోసెఫ్ చర్చి, NIT-5, ఫరీదాబాద్‌లో సహాయక విచారణ గురువుగా పంపబడ్డారు . 
1982-1988  వరకు రోహ్తక్ 'ప్రభాత్', కాథలిక్ చర్చి ప్రీస్ట్-ఇన్-చార్జిగాను,1988లో ప్రసాద్ నగర్‌లోని సెయింట్ మైఖేల్స్ చర్చిలో సహాయక విచారణ గురువుగా మరియు సెయింట్ మైఖేల్స్ జూనియర్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.
1991లో ఢిల్లీలోని మేజర్ సెమినరీలోని ‘ప్రతీక్ష’ రెక్టార్‌గా పనిచేశారు. 
విద్యాజ్యోతి (1991 - 1994) లో ఎక్యుమెనిజంలో M.ph. పూర్తిచేసారు 
1994-1998  రోమ్ సెయింట్ థామస్ అక్వినాస్ పొంటిఫికల్ యూనివర్సిటీ (ఏంజెలికం),  నుండి ఎక్యుమెనికల్ థియాలజీలో డాక్టరేట్ పొందారు . 
1998లో తిరిగి వచ్చిన తర్వాత గుర్గావ్‌లోని 'వినయ్ గురుకుల్' మైనర్ సెమినరీకి రెక్టార్‌గా నియమితులయ్యారు. 
1999లో ఎపిస్కోపల్ వికార్‌గా నియమితుడయ్యారు.
1999-2002 వరకు CCBI కమిషన్ ఫర్ ఎక్యుమెనిజంకు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు.
జనవరి 17, 2001న ఢిల్లీకి సహాయ పీఠాధిపతిగా మరియు సెన్క్యులియానా టైటులర్ పీఠాధిపతిగా నియమింపబడి,మార్చి 11, 2001న అభిషేకింపబడ్డారు. 
ఫిబ్రవరి 24, 2007న జలంధర్ పీఠాధిపతిగా నియమింపబడి మరియు ఏప్రిల్ 16, 2007న జలంధర్ పీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు. 
నవంబర్ 30, 2012న ఢిల్లీ అగ్రపీఠాధిపతిగా నియమింపబడి మరియు జనవరి 20, 2013న ఢిల్లీ అగ్రపీఠాధిపతిగా అభిషేకింపబడ్డారు.. 
2017 భోపాల్‌లో జరిగిన 29వ ప్లీనరీ అసెంబ్లీలోలో CCBI సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు.