శ్రీకాకుళం మేత్రాసనం లో భద్రమైన అభ్యంగనం స్వీకరించిన విశ్వాసులు
శ్రీకాకుళం మేత్రాసనం లో భద్రమైన అభ్యంగనం స్వీకరించిన విశ్వాసులు
శ్రీకాకుళం మేత్రాసనం, బత్తిలి, లివిరి గ్రామాన్ని శ్రీకాకుళం మేత్రానులు మహా పూజ్య శ్రీ రాయరాల విజయకుమార్ గారు సందర్శించారు. ఇతర గురువులతో కలసి గారు పవిత్ర దివ్యపూజాబలిని సమర్పించారు. అధిక సంఖ్యలో విచారణ విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు.
భద్రమైన అభ్యంగనం మనలను క్రీస్తుకి సాక్షులనుగా చేస్తుంది.జ్ఞానస్నానంలాగే భద్రమైన అభ్యంగనం కూడా పవిత్రాత్మ వరప్రసాదాన్నీ దయచేస్తుంది. ఈ సంస్కారం ద్వారానే ఆత్మ ఈ లోకంలో మనం క్రీస్తుకి సాక్షులంగా మెలిగేలా చేస్తుంది.
లివిరి విచారణ ప్రజలు దేవుని మార్గంలో నడిచేలా వారిని బత్తిలి విచారణ కర్తలు గురుశ్రీ థామస్ రెడ్డి గారు ఆధ్యాత్మికంగా తోడుండి ముందుకు నడిపిస్తున్నారు. ఉపదేశి మాస్టర్లు
ధర్మ మరియు శైలజలు తమ వంతు సహాయ సహకారాలను అందించారు. ఆద్యతం భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది.
విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను మధురంగా ఆలపించారు.ఈ కార్యక్రమానికి విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.లివిరి గ్రామస్తులు, ఉపదేశి మాస్టర్, సంఘ పెద్దలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు.
Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer