వెనిస్ జూబిలీ యాత్రికుల బృదంతో సమావేశమైన పోప్ 

గురువారం ఆగస్టు 7 న నగరంలోని సాంటా మారియా మాగ్గియోర్ చెరసాలలోని ముగ్గురు ఖైదీలతో సహా వెనిస్ నుండి వచ్చిన యాత్రికుల బృందాన్ని ప్రేక్షకుల సమావేశం ముందు  పోప్ లియో కలిశారు 

దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన వీరు జూబ్లీ తీర్థయాత్రలో భాగంగా ఇటాలియన్ పట్టణం టెర్ని నుండి రోమ్కు సుమారు 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు.

Patriarch of Venice, Archbishop Francesco Moraglia మరియు జైలు చాప్లిన్ Father Massimo Cadamuro, ఇతర ఆర్చ్ డియోసెసన్ అధికారులు ఈ  యాత్రికులతో పాటు ఉన్నారు.

పోప్ లియోని కలిసిన తరువాత ఈ తీర్థయాత్ర సంపూర్ణమైనట్లు నాకు అనిపిస్తుంది అని Father Massimo అన్నారు.

ఖైదీలను కూడా ఈ జూబిలీ యాత్రలో పాల్గొనడానికి అనుమతి  కలిపించడం నాకు సంతృప్తినిస్తుంది అని Enrico Farina, Santa Maria Maggiore ప్రిసొన్ డైరెక్టర్ అన్నారు