వలసదారులకు మద్దతుగా నూతన పోర్టల్‌ను ఆవిష్కరించిన భారత శ్రీసభ

భారతదేశంలోని కతోలిక శ్రీసభ దేశవ్యాప్తంగా వలసదారులకు మద్దతుగా నూతన డిజిటల్ పోర్టల్‌ను ఆవిష్కరించింది.
భారతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) అధ్యక్షుడు మరియు గోవా అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో సెప్టెంబర్ 27, 2024న పోర్టల్‌ను ప్రారంభించారు.
రాయ్‌పూర్ అగ్రపీఠాదిపతలు మహా పూజ్య విక్టర్ హెన్రీ ఠాకూర్, సీసీబీఐలోని వలసదారుల విభాగ అధ్యక్షులు మరియు ; ఢిల్లీ అగ్రపీఠాదిపతలు మహా పూజ్య అనిల్ జె.టి. కూటో, సెక్రటరీ జనరల్; నాగ్‌పూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఎలియాస్ గోన్సాల్వేస్;CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ డాక్టర్ స్టీఫెన్ అలతారా, ; గురుశ్రీ జైసన్ వడస్సేరి, సీసీబీఐలోని వలసదారుల విభాగ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ; మరియు CCBI మీడియా అపోస్టోలేట్ సమన్వయకర్త గురుశ్రీ డాక్టర్ సిరిల్ విక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కొత్త పోర్టల్, కాథలిక్ కనెక్ట్ లో విలీనం చేయబడింది, వలసదారులు ఉద్యోగం, విద్య లేదా స్థానభ్రంశం కోసం ఇతర కారణాల కోసం తరలివెళ్లడంలో సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఉదిష్టనుసారంగా ఈ పోర్టల్‌ను వలసదారులు మరియు శరణార్థులను స్వాగతించడం, రక్షించడం, ప్రోత్సహించడం మరియు సమగ్రపరచదానికి అనుగుణంగా ఉంది.
వలసదారులు వారి స్థానంతో సంబంధం లేకుండా శ్రీసభ సేవలను నమోదు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని, ఒక ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుంది అని అన్నారు